చంద్రబాబుకు త్వరలో మరి కొన్ని నోటీసులు...వారి ట్రాప్ లో పడొద్దు:మరో బాంబు పేల్చిన శివాజీ
విజయవాడ:సినీ హీరో శివాజీ తాజాగా మరో బాంబు పేల్చారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్వరలో మరో రెండు మూడు నోటీసులు రాబోతున్నాయని చెప్పారు. చంద్రబాబును వారి ట్రాప్ లో పడొద్దంటూ శివాజీ ఈ సందర్భంగా సూచించారు.
ఆపరేషన్ గరుడ కుట్ర అంటూ సంచలనం సృష్టించిన సినీ హీరో శివాజీ కొన్ని రోజుల కిందటే చంద్రబాబుకు నోటీసులు అంటూ ఇంకో బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. శివాజీ చెప్పిన ప్రకారమే అదే విధంగా రోజుల వ్యవధిలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు రాగా...తాజాగా చంద్రబాబుకు మరి కొన్ని నోటీసులు అంటూ శివాజీ మరో బాంబు పేల్చారు. దీంతో శివాజీ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.
2010నాటి బాబ్లీ ప్రాజెక్ట్ ఆందోళనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ నుంచి తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై టిడిపి కేంద్ర ప్రభుత్వాన్ని, బిజెపిని టార్గెట్ చేస్తుండటంతో జాతీయ రాజకీయాల్లోనూ ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే 'ఆపరేషన్ గరుడ'తో చంద్రబాబుపై నోటీసులంటూ సంచలన విషయాలను ముందే వెల్లడిస్తున్న సినీ హీరో శివాజీ తాజాగా మరో బాంబు పేల్చారు. చంద్రబాబుకు త్వరలోనే మరో రెండుమూడు నోటీసులు రాబోతున్నాయని శివాజీ వెల్లడించారు. అయితే చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ సిఎంకు సూచించారు.
ఈ సందర్భంగా తనను ఉద్దేశించి విమర్శలు చేసిన వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని శ్రీకాంత్ రెడ్డి తనపై కామెంట్స్ చేశారని, జగన్‌కు ఏమన్నా పని ఉందా అని శివాజీ మండిపడ్డారు. ఆయనేమన్నా మహాత్ముడా అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని శివాజీ వ్యాఖ్యానించారు. కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ వ్యాఖ్యానించారు.
జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని శివాజీ సూటిగా ప్రశ్నించారు. ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో మోడీకి ఎదురుగా నిలబడ్డ ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని శివాజీ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ ప్రస్తుతించారు.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications