• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు 73-గతమెంతో ఘనం-వర్తమానమే ఆందోళనకరం-గెలిచి నిలుస్తారా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీనియర్ ఎమ్మెల్యేగా, విపక్ష నేతగా, సీఎంగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, ఎన్డీయే కన్వీనర్ గా, వివిధ పాత్రలు పోషించిన చంద్రబాబునాయుడు ఇవాళ తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగిన చంద్రబాబు ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయాక నానాటికీ ఆయన పార్టీ పరిస్ధితి దిగజారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఎట్టిపరిస్ధితుల్లోనూ గెలిపించుకోవాల్సిన పరిస్ధితి ఆయనది. ఇందులో ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.

రాజకీయ దురంధరుడు చంద్రబాబు

రాజకీయ దురంధరుడు చంద్రబాబు

ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఓ రేంజ్ లో చక్రిం తిప్పిన చరిత్ర నారా చంద్రబాబునాయుడిది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్ధానం ప్రారంభించినా మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి వరుస విజయాలతో దుమ్మురేపిన చంద్రబాబు జాతీయ స్ధాయిలోనూ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించారు. 1994కు ముందు మామ చాటు అల్లుడిగా ఉన్న చంద్రబాబు.. 1995లో ఆయన దగ్గర నుంచి టీడీపీని లాక్కున్నారనే అపప్రద మూటగట్టుకున్నా పార్టీ నేతలంతా ఆయనకే అండగా నిలవడంతో సీఎం కాగలిగారు. మామకు వెన్నుపోటు పొడిచారన్న విమర్శల కంటే అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు తెచ్చుకున్న పేరే ఎక్కువకాలం నిలిచింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరడంతో పాటు కన్వీనర్ గా కూడా వ్యవహరించడం చంద్రబాబును సీనియర్ రాజకీయవేత్తగా మార్చింది. 2014లో మోడీకి మద్దతుగా నిలిచినా రాష్ట్రంలో జగన్ ట్రాప్ లో పడి ఎన్డీయేకు దూరం కావడం చంద్రబాబుకు భారీ దెబ్బగా మారింది. 2019లో మోడీపై చేసిన ధర్మపోరాటం చంద్రబాబు ప్రతిష్టను మసకబార్చింది. రాష్ట్రంలోనూ అధికారం కోల్పోవడంతో పాటు వైసీపీకి టార్గెట్ గా మారిపోయారు.

 గతంతో పోలిస్తే తగ్గిన వాడివేడీ

గతంతో పోలిస్తే తగ్గిన వాడివేడీ


గతంలో చంద్రబాబు అంటేనే ఫైర్. ఆయన తన నీడను కూడా నమ్మకుండా రాజకీయాలు చేస్తారనే పేరు. ఆయన చెప్పిందే వినాలి కానీ ఎవరు చెప్పిందీ ఆయన వినడనే విమర్శలు. బలహీనతలు ఎన్ని ఉన్నా అంతకు మించిన బలాలు ఆయన సొంతం. దీంతో చంద్రబాబు మూడుసార్లు సీఎం కాగలిగారు. మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్దితి వేరు. గతంలోలా ఆయన చురుగ్గా కదలలేకపోతున్నారు. వయసుతో పాటు ఆయన ఆలోచనా శక్తి కూడా మందగించినట్లు కనిపిస్తోంది. రొటీన్ రాజకీయవేత్తలా కనిపిస్తున్నారు. దీంతో వైసీపీలో చిన్నా చితకా నేతలు కూడా ఆయనతో ఆడుకుంటున్నారు. ఆయన భార్యపై అసెంబ్లీలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్ని జరుగుతున్నా ప్రత్యర్ధుల్ని పూర్తిస్ధాయిలో కార్నర్ చేయడంలో చంద్రబాబు విఫలమవుతూనే ఉన్నారు.

జగన్ నుంచి పెను సవాళ్లు

జగన్ నుంచి పెను సవాళ్లు

40 ఏళ్లకు పైగా చంద్రబాబు చేసిన రాజకీయం వేరు. ఇప్పుడు ఆయన చేయాల్సిన రాజకీయం వేరు. చేస్తున్న రాజకీయం ఇంకా వేరు. గతంలో చెన్నారెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి, వైఎస్ వంటి ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొని రాజకీయాలు చేసిన చంద్రబాబు.. ఇఫ్పుడు తనకంటే వయసులో ఎంతో చిన్నవాడైన జగన్ ను ఎదుర్కొనేందుకే అపసోపాలు పడుతున్నారు. దినికి ప్రధాన కారణం మారిన రాజకీయాలే. గతంలోలా రొటీన్ రాజకీయాల్నే నమ్ముకుని పబ్బం గడుపుకుందామంటే అస్సలు కుదరదు. దీంతో జగన్ కు పోటీగా ఎత్తులు వేయడంలో చంద్రబాబు విఫలమవుతున్నారు. కేవలం ప్రజల్లోకి వెళ్లి నిరసనలు చేసినంత మాత్రాన జగన్ పై పైచేయి సాధించమనే వాస్తవాన్ని చంద్రబాబు ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. జగన్ లా రాజకీయ వ్యూహకర్తల్ని కూడా నియమించుకుంటున్నా వారు చెప్పినట్లు ఆచరించడంలోనూ వైఫల్యాలే కనిపిస్తున్నాయి.

2024లో గెలిస్తే సరి.. లేకపోతే

2024లో గెలిస్తే సరి.. లేకపోతే


ఇప్పటికే మూడేళ్ల క్రితం జరిగిన ఎదురుదెబ్బల నుంచి కోలుకుని 2024 ఎన్నికలపై చంద్రబాబు పూర్తిస్దాయిలో దృష్టిపెట్టలేకపోతున్నారనే భావన పార్టీ క్యాడర్ లో ఉంది. జగన్ సర్కార్ విధానాలను ఎండగట్టే విషయంలో రొటీన్ రాజకీయాలకే పరిమితం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. వాటి నుంచి బయటపడి జగన్ తరహాలోనే సై అంటే సై రాజకీయాలు చేస్తే తప్ప చంద్రబాబు రాజకీయంగా పైచేయి సాధించడం కష్టంగా కనిపిస్తోంది. అలాగని 2024 ఎన్నికల్ని లైట్ తీసుకునే పరిస్ధితి లేదు. ఈసారి కూడా ఓడితే ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే టీడీపీ స్ధానాన్ని మరో రాజకీయ పార్టీ ఆక్రమించాల్సిన పరిస్దితులూ ఏర్పడతాయి. మరి వాటికి అవకాశమిస్తారా లేక తన సీనియార్టీని మరోసారి బయటికి తీసి టీడీపీని గట్టెక్కిస్తారా అన్నది 2024లో తేలిపోనుంది.

English summary
tdp chief chandrababu naidu enters into 73rd year. now he is doing as opposition leader in state assembly and party's national president also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X