'అమరావతి'ని దెబ్బతీస్తున్నారు: కాల్ మనీపై బాబు తీవ్ర హెచ్చరిక, ఎమ్మెల్యేల హస్తంపై ఆరా

విజయవాడ: కాల్ మనీ దందా పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్రంగా స్పందించారు. కాల్ మనీ దందాలో నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాల్ మనీ వద్ద అప్పులు తీసుకున్న వారు ఎవరూ కూడా తిరిగి డబ్బులు చెల్లించవద్దని సూచించారు.

కాల్ మనీ నిందితులు బాధితుల పైన వేధింపులు ఆపకుంటే నిర్భయ చట్టం కింద కేసులు పెడతామని చంద్రబాబు హెచ్చరించారు. అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

తప్పుడు పనులు చేసేవారు భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి నేరాలను ఆదిలోనే తుంచేయాలన్నారు. కాల్ మనీ ఘటనలు కొత్త రాజధాని అమరావతి ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ రాజధాని అమరావతి అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తి పూర్తి చేసుకుంటామని చంద్రబాబు చెప్పారు. 2029 నాటికి ఏపీ భారత దేశంలో అగ్రగామిగా ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ పది నగరాల్లో అమరావతి ఉండాలన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందాలన్నారు.

Chandrababu action against Call Money culprits

సృష్టించిన సంపద పేదలకు అందాలని చెప్పారు. పింఛన్ల పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఇ-పాస్ విధానం వల్ల నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరుగుతోందని చెప్పారు. రుణమాఫీ కింద రూ.8,400 కోట్లు ఇచ్చామని చెప్పారు. మరో విడత రుణమాఫీ త్వరలో చెల్లిస్తున్నామన్నారు.

కాల్ మనీ వ్యాపారుల వివరాల సేకరణ

టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాల్ మనీ వ్యాపారుల వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రజాప్రతినిధుల హస్తం పైన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులను కాల్ మనీ వ్యాపారులు బెదిరిస్తున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+