ఈశ్వరన్‌తో బాబు ఏరియల్ సర్వే, జగన్‌ది జైలుదారని

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి విశాఖపట్నం నగరం పైన మంగళవారం విహంగ వీక్షణం చేశారు. కైలాసగిరి పైన ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం పారిశ్రామిక వేత్తల సదస్సులో ప్రసంగిస్తారు.

2015-16 రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జైలు దారి తప్ప అభివృద్ధి దారి కనిపించదన్నారు.

Chandrababu aerial survey with Singapore Minister

అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు సలహా కమిటీని నియమిస్తామన్నారు. టీడీపీది అభివృద్ధి చేసే విజన్‌ అయితే కాంగ్రెస్‌ది దోచుకునే విజన్‌ అని వ్యాఖ్యానించారు. వచ్చే బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందన్నారు. ప్రజాసంక్షేమంతో పాటు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్‌ రూపకల్పన చేస్తున్నామన్నారు.

చట్టం తనపని తాను చేసుకుపోతుంది: కేఈ

పరిశ్రమలకు భూకేటాయింపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. పరిశ్రమలు స్థాపించని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో తీసుకొస్తున్న నూతన విధానాలకు సంబంధించి అనంతపురం, గుంటూరు, ఏలూరులో త్వరలో శిక్షణ నిర్వహిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+