వైఎస్ జగన్ భీమిలి సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కటౌట్లు.. షర్మిల ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి ఎన్నికలకు ముందు భీమిలి నియోజకవర్గం నుండి సమర శంఖాన్ని పూరించింది. ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి భీమిలి వేదికగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసి మూడు లక్షల మంది జన సమీకరణ తో నిర్వహించిన ఈ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిపిఐనేత రామకృష్ణల క్యారికేచర్ కటౌట్లు దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
అయితే వైసిపి సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిపిఐ రామకృష్ణలను వికృతంగా చూపిస్తున్న కటౌట్లు వైసిపి నే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. వైసీపీ ఈ దఫా ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతోందని, ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి ప్రచారంలో వింత సాంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్నారని ఈ కటౌట్ లను చూస్తున్నవారు చర్చిస్తున్నారు.

ఇక ఈ ఫోటోలను హైలైట్ చేస్తూ వైసిపి సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టింది. సిద్ధం వేడుక వద్ద పెత్తందారులు అంటూ పోస్ట్ పెట్టిన వైసిపి జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పెత్తందారులపై యుద్ధానికి నేను సిద్ధం... మీరు సిద్ధమా...? అని జగన్ ప్రజలను ప్రశ్నిస్తున్నట్లు పోస్ట్ చేసింది.
సిద్ధం వేడుక వద్ద పెత్తందారులు…
— YSR Congress Party (@YSRCParty) January 27, 2024
జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న ఈ పెత్తందారులపై యుద్ధానికి నేను సిద్ధం… మీరు సిద్ధమా…? #Siddham ✊🏻 pic.twitter.com/wRcF0anQQp
నిత్యం వైసిపి పై విమర్శలు గుప్పించే వీరిని సీఎం జగన్ ఇటీవల కాలంలో టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దుష్ట చతుష్టయం అంటూ ప్రతిపక్షాల పైన, పత్రిక అధిపతుల పైన సీఎం జగన్ విరుచుకు పడుతున్నారు. నేడు భీమిలి సభ వేదికగా కూడా సీఎం జగన్ ఏపీలో ప్రతిపక్ష పార్టీల నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.
వీరి ఫోటోలను చూపించి రాజకీయంగా విమర్శలు చేశారు. అందుకే వైసిపి సభలో ప్రతిపక్ష నాయకులను నెగిటివ్ గా చూపించే కటౌట్లను పెట్టి కొత్త ప్రచారానికి తెర తీశారు. అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఈ పోస్టులో మాత్రం వైయస్ షర్మిల ఎక్కడ అంటూ ఎక్కువమంది ప్రశ్నించడం గమనార్హం.












Click it and Unblock the Notifications