Chandrababu-Pawan Kalyan: చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలివే..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పనిచేస్తున్న టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ఆయనతో సమావేశం అయ్యారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి పవన్ కళ్యాణ్ రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ముందుగా పలకరింపులు పూర్తయ్యాక ఇరువురు నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ముఖ్యంగా వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పు తర్వాత తమ పార్టీల్లోకి తామర తంపరగా వస్తున్న ఫిరాయింపు నేతల విషయంలో ఎలా వ్యవహించాలనే అంశం కూడా ఒకటి. ఇతర పార్టీల్లో నుంచి వచ్చే వారికి అన్ని విధాలుగా పరిశీలించాకే తమ పార్టీల్లోకి ఆహ్వానించాలని చంద్రబాబు, పవన్ ఇద్దరూ నిర్ణయించారు. అలాగే రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే నేతల్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ తీసుకోవద్దని కూడా నిర్ణయించారు.

మరోవైపు ఇరు పార్టీల తరఫున అభ్యర్ధుల తొలి జాబితాలను సిద్ధం చేసిన తర్వాతే ఉమ్మడి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ భేటీలో నిర్ణయించారు. అలాగే భవిష్యత్ కార్యాచరణతో పాటు టీడీపీ-జనసేన తరఫున తొలి జాబితా విడుదల చేసే విషయంపై ఇరువురు నేతలు లోతుగా చర్చిస్తున్నారు. అలాగే రేపు ఉదయం అమరావతి రాజధాని గ్రామమైన మండడంలో నిర్వహించే భోగి కార్యక్రమంలో ప్రజా వ్యతిరేక జీవోల్ని మంటల్లో వేసి కాల్చాలని కూడా వీరు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications