వేరే అభ్యర్థి కోసం ఓటేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికల పోలింగ్ ఆద్యంతం దాడులు, ప్రతిదాడులు ఉద్రిక్తతలతో అనేక చోట్ల హింసాత్మక ఘటనలతో కొనసాగింది.
వేరే వాళ్లకు ఓటేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు
ఓటర్లు మాత్రమే కాదు ఈ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని, ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఎన్నికల సమరంలో హోరాహోరీగా పోరాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తమ ఓటును తమ కోసం వేసుకోలేక పోయారు.

కుప్పంలో ఓటు లేని చంద్రబాబు
దాదాపు రాజకీయాలలో ఉన్నవారు, అభ్యర్థులుగా పోటీ చేసిన వారు తమ నియోజకవర్గంలోనే తమ ఓటును వేసుకుంటారు. కానీ ఏపీలో టిడిపి, జనసేన పార్టీల అధినేతలే తమ ఓట్లను తాము పోటీ చేసే నియోజకవర్గంలో వేసుకోలేక పోయారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం వర్గం నుండి పోటీ చేశారు. అయితే చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం నుండి ఓటు లేకపోవడం గమనార్హం.
పిఠాపురంలో ఓటు లేని పవన్ కళ్యాణ్
మంగళగిరిలో ఆయన కుటుంబం ఓట్లు ఉండడంతో, ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా మంగళగిరి నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేసినప్పటికీ, ఆయనకు పిఠాపురంలో ఓటు హక్కు లేదు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటేసింది అక్కడే
ఆయనకు మంగళగిరిలో ఓటు హక్కు ఉండడంతో, నేటి ఉదయం హెలికాప్టర్లో మంగళగిరి చేరుకుని అక్కడ లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో పవన్ కళ్యాణ్, సతీ అన్నా లేజ్నేవాతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓటేశారు.












Click it and Unblock the Notifications