వివాదాస్పద నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. జనసేన, బీజేపీలకు పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లను మినహాయించి.. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారాయన. మొదటి జాబితాలో 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు గురువారం నాడు మరో 34 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేశారు. తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖారారు చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గత కొద్దిరోజులుగా నిత్యం వార్తల్లో నిలిచిన నియోజకవర్గాలైన మైలవరం, పెనమలూరుకు సంబంధించిన టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడంతో మైలవరం టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే , చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమ మహేశ్వరరావు తన రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. వసంతపై బహిరంగంగానే ఉమ విమర్శలకు దిగారు. ఇరు వర్గాలు కూడా మైలవరం టికెట్ తమకే అని ప్రచారం చేసుకున్నాయి.

Chandrababu announced two candidates key constituencies

దీంతో మైలవరం టీడీపీ టికెట్ ఎవరికి దక్కుతుందా అని తెలుగు తమ్ముళ్లు అతృతుగా ఎదురు చూశారు. తాజాగా ఈ ఉత్కంఠకు తెర దించుతూ మైలవరంతో పాటు పెనమలూరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. మైలవరం సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కే కేటాయిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పెనమలూరు అభ్యర్థిగా మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావు పేరును ఖారారు చేశారు. ఈ నిర్ణయంతో మైలవరం , పెనమలూరుల పంచాయితీకి తెరపడినట్టు అయింది. పెనమలూరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+