టిడిపి 13 జిల్లాల అధ్యక్షులు వీరే, అశోక్ అనుచరుడికి గంటా చెక్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో టిడిపి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గత కొద్ది రోజులుగా జిల్లాల అధ్యక్షుల ఎన్నికపై చంద్రబాబు, ఇతర టిడిపి నేతలు కసరత్తు చేస్తున్నారు. ఆదివారం ఎట్టకేలకు ఫైనల్ చేశారు.

చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేశారు.

బాబు జాగ్రత్తగా..: పేరు తీసేసి అశోక్‌కు గంటా షాక్, శిల్పాకు ఏదో ఒకటి

శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-మహంతి చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌-వాసుపల్లి గణేష్, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేష్‌ బాబు,తూర్పు గోదావరి- నామన రాంబాబు, పశ్చిమ గోదావరి- తోట సీతరామలక్ష్మి, కృష్ణా- బచ్చుల అర్జునుడు, గుంటూరు- జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం- దామచర్ల జనార్దన్, ఎస్పీఎస్ నెల్లూరు- బీదా రవిచంద్ర, కడప- శ్రీనివాస్‌రెడ్డి, అనంతపురం- బీకే పార్థసారథి, కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, చిత్తూరు- పులివర్తి మణిప్రసాద్‌ల పేర్లు ప్రకటించారు.

 Chandrababu announces District presidents name

విజయనగరంలో అశోక్ మాట చెల్లలేదా?

విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఎవరి పేరు చెబితే వారే జిల్లా అధ్యక్షులు. అందుకే ఆయన అనుచరుడు జగదీష్ ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.

కానీ ఈసారి మంత్రి గంటా శ్రీనివాస రావు, మరికొందరు నేతలు చక్రం తిప్పారని అంటున్నారు. అశోక్ అనుచరుడైన జగదీశ్ పేరు తీసేసి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపారు.

జగదీశ్ పేరును అభిప్రాయ సేకరణలో తీసుకోనప్పటికీ అశోక్ సూచించిన వారినే చంద్రబాబు తీసుకుంటారని భావించారు. అశోక్.. జగదీష్ పేరును సూచిస్తారని భావించారు. కానీ విజయనగరం జిల్లా నుంచి మహంతి చిన్నమనాయుడిని అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has announced District presidents name on sunday.
Please Wait while comments are loading...