కేసీఆర్‌కు చెప్పినా విన్లేదు: బాబు, రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలపై కీలక వ్యాఖ్యలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ బుధవారం భేటీ అయింది. సీనియర్ నేతలు, పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్‌ల వైఖరిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు.

పవన్, జగన్‌లకు ధీటుగా బదులివ్వండి, కానీ
పవన్ కళ్యాణ్, జగన్, ఇతర విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు లేకుండా ధీటుగా బదులివ్వాలని అధినేత సూచించారు. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఇటీవల ఐటీ దాడులు జరిగాయని ఓ మంత్రి వ్యాఖ్యానించారని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా పలువురి నివాసాల్లో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఓ మంత్రి స్పందించారు.

ఏపీలోను ఐటీ దాడులు జరిగే ఛాన్స్
తెలంగాణలో కేంద్రం ఆదేశాల మేరకు ఐటీ దాడులు జరుగుతున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్‌లోను ఇదే తరహా దాడులు జరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని మరో మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులను టార్గెట్ చేస్తూ కేంద్రం కుట్రలు పన్నుతోందని సీనియర్ నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే జాతీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. జాతీయ రాజకీయాలపై స్పష్టంగా ఉండాలని పలువురు మంత్రులు అధినేతకు సూచించారు. బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకతాటిపై నడపడానికి చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకోవాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాపై దాడి చేసిన వారే అరకులో జంట హత్యకలు పాల్పడ్డారు
తాజా రాజకీయాలతో పాటు రాష్ట్రంలో మావోయిస్టుల కదలికల పైన కూడా చంద్రబాబు, మంత్రులు, సీనియర్ నేతలు చర్చించారు. తనపై దాడి చేసిన వారే అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

కలిసి పని చేద్దామని కేసీఆర్‌కు చెప్పా కానీ
రాజకీయంగా కలిసి పని చేద్దామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను సంకేతాలిచ్చానని చంద్రబాబు నేతలతో చెప్పారు. కానీ కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మాయలో పడి తన ప్రతిపాదనకు అంగీకారం తెలపలేదన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకేనని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కలిసి టీడీపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయన్నారు. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవని మంత్రులు, ముఖ్యనేతలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు












Click it and Unblock the Notifications