చంద్రబాబు అవినీతి గుట్టు రట్టు.. తాజాగా

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండంటే రెండే ఎకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆరు లక్షల కోట్ల రూపాయలను పోగు చేసుకున్నాడని, అదంగా ప్రజల సొమ్మేనని స్పష్టం చేస్తోన్నారు.

అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ మొదలుకుని, అమరావతి ఇన్నర్ రింగురోడ్డు వరకు చంద్రబాబు అండ్ కో పాల్పడిన అవినీతి లేదని ధ్వజమెత్తుతున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ఏలేరు కుంభకోణానికి పాల్పడ్డారని, హైదరాబాద్‌ సైబర్ టవర్స్ నిర్మాణానికి ముందు అక్కడ భూముల కొనుగోళ్ల వరకు దందా నడిపించాడని మండిపడ్డారు.

Chandrababu

ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా పథకాన్ని చేపడితే అది అమలుకు ముందే కోట్ల రూపాయలను దిగమింగేసే ఘరానా నాయకులు చంద్రబాబు అనుచరులేనని అన్నారు. ప్రభుత్వ ధనాన్ని మింగిన తరువాత మెల్లగా ఆ పథకాన్ని దారిలో పెడతారని విమర్శించారు. ఇదే చంద్రబాబు అవినీతి స్టయిల్ అంటూ ఆరోపించారు.

ఈ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడినా కూడా తాను గాంధీనని, అయనలో జీవిస్తున్నానని, తన చేతికి వాచీ, ఉంగరం కూడా లేదంటూ అబద్ధాలు ఆడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు వాచీ లేదు గానీ లక్షల కోట్ల ఆస్తులున్నాయని, అదంతా అక్రమాల పుట్టేనని మండిపడ్డారు.

దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి దెబ్బతో పదేళ్లు అధికారానికి దూరమైన చంద్రబాబు అవినీతికి, అక్రమ సంపాదనకు ముఖం వాచి పోయాడని, 2014లో దాదాపు 600 హామీలు, అటు పవన్ కల్యాణ్, ఇటు బీజేపీ సహకారంతో అధికారంలోకి వచ్చాడని, వచ్చీ రాగానే ఆవురావురుమంటూ స్కిల్ డెవలప్మెంట్ పథకంలో కోట్ల రూపాయలను దిగమింగాడని చెప్పారు.

ఆ తరువాత ఇక ఆయన అయిదేళ్లు వెనుదిరిగిచూడలేదని, ప్రతి పథకాన్నీ తనకు బంగారు బాతుగుడ్డుగా మార్చుకున్నారని అన్నారు. 16,000 కోట్లు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టును 57, 950 కోట్ల రూపాయలకు పెంచేశారని, ఒకే డీల్‌లో దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలను కొట్టేశారని అన్నారు.

ఇదే కాకుండా జలవనరుల శాఖలో పనులన్నీ నామినేషన్ మీద సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి కట్టబెట్టి అక్కడ మరో 4,834 కోట్ల రూపాయలను నొక్కేశారని, దీని తరువాత చంద్రబాబు కళ్ళు గోదావరి- పెన్నా నదుల అనుసంధానం మీదకు వెళ్ళిందని గుర్తు చేశారు. ఇక్కడ రూ. 6,020 కోట్ల పనులకు టెండర్లు పిలిచి అందులో సరిగ్గా 50 శాతం మింగేశారని విమర్శించారు.

పోలవరం మట్టికట్ట పనుల్లో మరో రూ.1,590 కోట్లు మాయం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో రూ. 573 కోట్లు అమాంతం అయన ఖాతాలోకి వెళ్ళిపోయాయి. విశాఖపట్నంలో భూముల పత్రాలు హుద్ హుద్ తుఫాన్ పేరుతో ఆక్రమించేసుకున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు.

Chandrababu

చంద్రబాబు పాలనలో ఉంటే కరువులు కాటకాలు. తుఫానులూ .. వరదలు వెల్లువెత్తుతాయి. ఈ ఉత్పాతాలన్నీ ప్రజలకు కడగండ్లు మిగులుస్తాయి. చంద్రబాబుకు మాత్రం ఆస్తులు పెంచుతాయని ఆరోపించారు. పెందుర్తి, భీమిలి, యలమంచిలి, అనకాపల్లి.. ఇలా కుదిరిన చోటల్లా భూములను కబ్జా చేశారని, రాత్రికి రాత్రి పత్రాలు సృష్టించారని విమర్శించారు.

ఈ కుంభకోణం విలువ లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇక 24,514 ఎకరాల ఇనాం భూములను కబ్జా చేసిన టీడీపీ నాయకులూ దాదాపు రూ.5,097 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని వివరించారు. నీరు- చెట్టు - ఇసుక ఇలా ప్రతిదాన్నీ చంద్రబాబు, టీడీపీ నేతలు దోచేశారు. దీని విలువ రూ. 34,399 కోట్ల రూపాయల పైమాటేనని తేల్చి చెప్పారు. ఇలా ఆయన దోచిన సంపద రూ. 6,00,000 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+