మంత్రుల ఆంగ్ల ప్రావీణ్యంతో బాబుకు చిక్కులు: గల్లా జయదేవ్‌కు బాధ్యతలు

హైదరాబాద్: జాతీయ మీడియాతో మాట్లాడే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌కు అప్పగించారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర మంత్రులు వచ్చీరాని ఆంగ్లభాషలో మాట్లాడడంతో జాతీయ మీడియా నుంచి చిక్కులు వచ్చి పడ్డాయి. దీంతో జయదేవ్‌కు మాత్రమే జాతీయ మీడియాతో మాట్లాడే బాధ్యతను అప్పగించారు.

రాష్ట్ర మంత్రులకే కాకుండా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ పార్లమెంటు సభ్యుల్లో ఒకరిద్దరికి మాత్రమే ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉంది. దాంతో జాతీయ మీడియాతో మీరొక్కరే మాట్లాడాలంటూ జయదేవ్‌ను చంద్రబాబు కోరినట్టు సమాచారం.

చంద్రబాబు మీడియా ప్రచారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, ఆయన మంత్రివర్గంలోని మంత్రులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా జాతీయ మీడియా అంటే హడలెత్తిపోతున్నరాని అంటున్నరాు. ఆంగ్ల భాషలో తగిన ప్రావీణ్యం లేకపోవడమే దానికి కారణమని అంటున్నారు.

 Chandrababu asks Galla jayadev to speak with national media

గోదావరి పుష్కరాల తొక్కిసలాట సమయంలో జాతీయ మీడియా ముందు వచ్చీరానీ ఇంగ్లీషులో మాట్లాడిన ఒకరిద్దరు ఏపీ మంత్రులు చిక్కులు తెచ్చిపెట్టారు. ఇది చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో జాతీయ స్థాయిలో ఇలాంటి పొరపాట్లు పునరావృత్తం కాకుండా ఉండేలా ఆంగ్ల భాషపై మంచి పట్టున్న ఎంపీ గల్లా జయదేవ్‌ను ఎంపిక చేసి జాతీయ మీడియా బాధ్యతలను అప్పగించారు.

ఆయన మాత్రమే ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను జాతీయ మీడియాకు వివరిస్తారని ఆదేశాలు జారీచేశారు. ఇంగ్లీష్ చానెల్స్ అంటే దేశం మొత్తం చూస్తారు. అలాగే ఇతర దేశాలలోని మన వారు కూడా చూస్తారు. చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఇష్టం లేని చంద్రబాబు ఆ జాగ్రత్త తీసుకున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+