శ్రీవారే కాపాడారు: కుటుంబ సమేతంగా బాబు (పిక్చర్స్)
తిరుమల: ప్రపంచంలోనే అతిశక్తిమంతమైన దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామివారే తనను రక్షించి, పునర్జన్మ ప్రసాదించారని. శ్రీవారి కటాక్షంతో మరో జన్మనెత్తిన తాను ప్రజల సేవకోసం జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరఫున చంద్రబాబు పట్టు వస్ర్తాలు సమర్పించారు. పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా తన ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల వేళ 2003లో తాను కొండకు వస్తుండగా కొందరు తనపై హత్యాయత్నం చేస్తే స్వామివారే తనను రక్షించి, పునర్జన్మ ప్రసాదించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఇలా శ్రీవారి కటాక్షంతో మరో జన్మనెత్తిన తాను, ప్రజల కోసం, స్వామివారి భక్తుల సేవకోసం జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. స్వామికి శుక్రవారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించాక ఆలయంలోని రంగనాయకుల మంటపంలో ‘శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్' (ఎస్వీబీసీ)తో, వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమలలో గోవిందనామాన్నే స్మరించాలని ఆయన సూచించారు.

తిరుమలలో బాబు
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చరిత్రలో ఎక్కువసార్లు స్వామికి పట్టువస్త్రాలను తానే సమర్పించడం ఆనందంగా ఉందన్నారు.

అతి శక్తివంతమైన దేవుడు
ప్రపంచంలో అతి శక్తిమంతుడైన దైవం శ్రీవేంకటేశ్వరుడేనని, ఆయన భక్తులకు సేవచేస్తే భగవంతుడికి చేసినట్లేనని పేర్కొన్నారు.

అర్చకుల సమస్య పరిష్కారం
నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకే ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని తెచ్చామన్నారు. అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

త్వరలో పాలక మండలి
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగాపండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ధర్మాన్ని కాపాడాలని దేవదేవుణ్ని ప్రార్థించానని చెప్పారు. టీటీడీకి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని తెలిపారు.

పన్నెండేళ్ల తర్వాత...
పన్నెండేళ్ల తర్వాత రాష్ట్ర అధినేత హోదాలో ఆయన కుటుంబసమేతంగా వచ్చారు. తొలుత పద్మావతి అతిథిగృహంలో కాసేపు విశ్రాంతి తర్వాత రాత్రి 7:30-8:00 గంటల మధ్య బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.

పట్టువస్త్రాల సమర్పణ
ఆలయ ప్రధానార్చకులు ఆయన తలపై పరివట్టం చుట్టగా, పట్టువస్త్రాలున్న వెండి పళ్లేన్ని తలపై ఉంచు కుని మంగళవాద్యాల నడుమ చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించారు. మహద్వారం వద్ద సంప్రదాయ స్వాగతం లభించగా, స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.

హుండీలో కానుకలు..
దర్శనానంతరం జియ్యంగార్లు శేషవస్త్రాన్ని బహూకరించారు. అనంతరం సీఎం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు.

తీర్థ ప్రసాదాలు..
రంగనాయక మంటపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ జేసీ శర్మ తదితరులు తీర్థప్రసాదాలు, ప్రచురణలు, చిత్రపటాన్ని బహూకరించారు.

కుటుంబ సమేతంగా...
చంద్రబాబు వెంట సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి, మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాణిక్యాలరావు, ఎమ్మెల్యేలు వెంకటరమణ, శంకర్, తలారి ఆదిత్య తదితరులున్నారు

పట్టు వస్త్రాలను ఇలా సమర్పించారు..
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలేశుడికి పట్టు వస్త్రాలను ఇలా సమర్పించారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
క్యూలైన్ నిర్వహణలో ఇకపై.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ??












Click it and Unblock the Notifications