ఉత్తరకుమారుడు, దత్తపుత్రుడు: సోనియాపై బాబు
గుంటూరు/ విజయవాడ: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై విరుచుకుపడ్డారు. వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన రాష్ట్ర విభజనపై కూడా మాట్లాడారు. సొంత పుత్రుడు ఉత్తరకుమారుడు అయ్యాడని సోనియా గాంధీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను దత్తపుత్రుడిగా చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
పది కేసుల్లో తొలి ముద్దాయిగా ఉన్న వైయస్ జగన్‌కు బెయిల్ రావడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే తనపై తీర్చుకోవాలి గానీ తెలుగుజాతిపై తీర్చుకోవద్దని ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.

వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టపుచూపుగా తిరిగారని చంద్రబాబు విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న బాబు గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. ముంపునకు గురైన గ్రామాల్లో పునరుద్దరణ పనులు ఇప్పటికీ చేపట్టలేదని మండిపడ్డారు.
విపత్తులను ఎదుర్కోవడంలో సీఎం అవగాహనారాహిత్యం బయటపడిందన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ిడ అసమర్ధుడు, చేతకానివాడని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనాసక్తి ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటకీ వరద నష్టాన్ని కేంద్రం ప్రకటించలేదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
విభజనపై తలపెట్టిన అఖిలపక్షంపై కేంద్రం నుంచి లేఖ అందిన తర్వాత పార్టీలో చర్చించి స్పందిస్తామన్నారు. తమను పట్టించుకోకపోవడం వల్లే సీమాంద్రులు మానసిక క్షభకు గురయ్యారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ, ఆంటోని, రోశయ్య క మిటీలేమయ్యాయి, ఇప్పుడు మళ్లీ అఖిలపక్షం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications