చంద్రబాబు పవన్ వైపు: పవన్ కల్యాణ్ వ్యూహం మరోవైపు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బిజెపితో తెగదెంపులు చేసుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేనట్లే ఉంది. ఈ స్థితిలో ఆయన ప్రత్యామ్నాయంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నారు.

  Pawan Kalyan Visits Polavaram Project and Gets Doubt On Chandrababu

  పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ తేల్చడం లేదు. తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఓసారి, ఎన్నికల సమయంలో చూస్తామని మరోసారి ఆయన అంటూ వస్తున్నారు. సిపిఎం దాదాపుగా పవన్ కల్యాణ్‌తో నడిచి వెళ్లడానికి సిద్దమైనట్లు కనిపిస్తోంది.

  పవన్ తాజా వ్యూహం

  పవన్ తాజా వ్యూహం

  కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపడం, కేంద్రంపై ఇంతకాలం చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడి తేలేకపోవడం వంటి విషయాలను ఆసరా చేసుకుని పవన్ కల్యాణ్ బలపడాలనే యోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారిన క్రమంలో తెలంగాణ ఉద్యమం వంటి ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు.

  పవన్ కల్యాణ్ అందుకే అలా...

  పవన్ కల్యాణ్ అందుకే అలా...

  ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో నడపడానికి అవసరమైన పూర్వరంగాన్ని ఆయన తయారు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వెంట ప్రజల్లో పేరు పొందిన నాయకులు గానీ, మేధావులు గానీ లేరు. ఇప్పుడు ఆయన జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారిని కలుపుకోవడం ద్వారా ప్రజామోదాన్ని మరింతగా పొందే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

  ఇప్పటి వరకు ఒకే ఒక్కడు..

  ఇప్పటి వరకు ఒకే ఒక్కడు..

  జనసేన విషయంలో పవన్ కల్యాణ్ బయటకు తానొక్కడే కనిపిస్తున్నారు. పార్టీ తరఫున కాకున్నా తాను నడిపే ఉద్యమానికి, రాజకీయాలకు బయటి నుంచైనా మాట సాయానికి, తనకు మద్దతు పలకడానికి అవసరమైన నేతలను, మేధావులను సమకూర్చుకుంటున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

  చంద్రబాబుతో కలుస్తారా..

  చంద్రబాబుతో కలుస్తారా..

  పవన్ కల్యాణ్ ఈ స్థితిలో చంద్రబాబు కలిసి నడుస్తారా అనేది ప్రశ్నార్థకమే. ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటివారికి పదవులూ హోదాలు అక్కర్లేదు. అటువంటివారితో పాటు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అట్టుడుకుతున్న యువత తన వైపు వస్తే పవన్ కల్యాణ్‌కు చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ అవసరమైతే ఎన్నికలు ముగిసిన తర్వాత ఆలోచించుకోవచ్చుననే వైఖరితో ఆయన ముందుకు సాగవచ్చు.

  రాయలసీమ నుంచి ఒకరిని

  రాయలసీమ నుంచి ఒకరిని

  రాయలసీమ నుంచి సమాజంలో పలుకుబడి, విశ్వసనీయత సంపాదించుకుని పేరున్న ఓ రాజకీయ నాయకుడి గానీ మేధావిని గానీ సంపాదించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు తిరుగు ఉండకపోవచ్చు.

  అయితే ఇలా చేయాల్సిందే..

  అయితే ఇలా చేయాల్సిందే..

  పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమ్ము రేపాలంటే మాత్రం ప్రత్యేక హోదా నినాదాన్ని, కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని, కేంద్రం పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న మెతక వైఖరిని, వైయస్ జగన్ అవినీతి కేసులు ప్రధానాంశాలు కావాల్సిందే. వాటికి తోడు, రాష్ట్ర ప్రజల నిర్దిష్టమైన, సార్వజనీన సమస్యలు కూడా ఆయన ఎత్తుకోవాలి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jana Sena chief Pawan Kalyan may not intersted to tie up with Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి