వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధి ప్లాన్: సత్య నాదెళ్ల కోసం చంద్రబాబు ఆరాటం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)కి ఊపు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తుల పాత్రను ఆశిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, కాకినాడ వంటి నగరాల్లో వచ్చే మూడేళ్లలో ఐటి టవర్స్, ఐటి పార్కులు, ఐటి జోన్స్‌ ఏర్పాటు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ఆయన భావిస్తున్నారు.

మహిళలకు 15 శాతం బిల్టప్ స్పేస్ ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వారికి గరిష్టంగా 25 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ క్యాపిటల్‌పై 25 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. ఇందుకుగాను ఎలక్ట్రానిక్స్, ఐటి ప్రమోషన్ కోసం సాధికారికమైన మిషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాని ద్వారా వేగంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.

Chandrababu Babu tries to woo Microsoft CEO Satya Nadella

ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీల స్థాపనకు ఎన్నారైలను ఆహ్వానించడానికి ఐటి మంత్రి పల్లె రఘునాథ రెడ్డి నేతృత్వంలో ఓ బృందం అమెరికా, ఇంగ్లాండు దేశాల్లో పర్యటించనుంది. ఐటి బాస్‌లతో చంద్రబాబు ఓ ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరాలని చంద్రబాబు భావిస్తున్నారు.

సీమాంధ్రకు చెందిన మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్లను తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు రప్పిస్తారని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కమ్ క్యాంపస్ ఏర్పాటయ్యేలా చూడాలనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్ రాకుండా ఆంధ్రప్రదేశ్‌లో వచ్ేచ ఐదేళ్లలో ఐటి, ఫార్మా, తదితర పరిశ్రమలు పెద్ద యెత్తున వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu will rope in private players to give a boost to the Information Technology sector in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X