భారీ మార్పు: బాబు, అ సినిమాలు మానేస్తా: బాలకృష్ణ

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అవినీతి, పేదరికం లేని సమాజమే తమ ధ్యేయమన్నారు. టిటిడిలో భారీ మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు. ఉద్యోగులతో పాటు భక్తుల సేవలను ఉపయోగించుకుంటామని చెప్పారు. భక్తులకు సంతృప్తి కలిగేలా దర్శనం అయ్యే ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికడతామన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని చెప్పారు. కాగా, అంతకుముందు ఆయన మాట్లాడుతూ... తాను ఇక నుండి ఫ్యాక్షన్, రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను మానివేస్తానని చెప్పారు. అభిమానులకు, ప్రజలకు ఆనందాన్ని, హాస్యాన్ని పంచే సినిమాలు చేస్తానని చెప్పారు.
తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, పదేళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా వ్యవహరించి ఐదోసారి టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికవడం చిరస్మరణీయమని బుధవారం రాత్రి బాలకృష్ణ అభినందించారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి బాబు ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని చెప్పడంలో అతిసయోక్తి లేదన్నారు. చంద్రబాబు మీద నమ్మకంతో అభివృద్ధికి ఓటేసి తెలుగదేశాన్ని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు.












Click it and Unblock the Notifications