చంద్రబాబుకు మైనస్, పెద్దిరెడ్డికి ఫ్లస్ పాయింట్, అధికారం వచ్చినా రివర్స్ అయ్యింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరులో ఇంకా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైసీపీ సొంతం చేసుకున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే పుంగనూరు, తంబళ్లపల్లెలో టీడీపీ నాయకులు ఆధిపత్య పోరు మొదలయ్యింది. ఈ దెబ్బతో సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు సీరియస్ అయ్యారని తెలిసింది.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవ పడటం ఇప్పుడు టీడీపీ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మొదటి నుండి టీడీపీలో ఉన్న నాయకులు, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకులు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది.

వైసీపీ నుండి వలస వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయమై టీడీపీ హై కమాండ్ ఆరా తీసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పుంగునూరు నియోజక వర్గం పర్యటన సందర్భంగా టీడీపీలో వర్గ పోరు మొదలై అది బహిరంగమైంది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి స్వాగతం పలికేందుకు ఆయనపై పూలు చల్లారు. ఈ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి. మీరు పూలు చల్లకూడదు అంటే, లేదు మీరు పూలు చల్లకూడదు అని టీడీపీలోని రెండు వర్గాల నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. పుంగనూరు టీడీపీ నాయకుడు రమేష్ అలియాస్ ఆర్ వీ. బాబు, ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాధవ రెడ్డి అనుచరుల మధ్య గొడవలు మొదలైనాయి.
తర్వాత టీడీపీ సీనియర్ నాయుడు బాబు వ్యక్తిగత గన్ మెన్ అతని అనుచరులు కలిసి మాధవ రెడ్డి వర్గంలోని భీమగానిపల్లెలో నివాసం ఉంటున్న మణికంఠ అనే యువకుడిని తుపాకీతో బెదిరించి పిలుచుకుని వెళ్లి ఇంట్లో నిర్బందించారు. ఈ విషయం తెలుసుకున్న మాధవ రెడ్డి, అతని అనుచరులు బాబు ఇంటికి వెళ్లి మణికంఠ వదలి పట్టాలని నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు.

టీడీపీ నాయకుడు ఆర్ వీ. బాబు అతని అనుచరులపై కేసు పెట్టాలని మాధవ రెడ్డి వర్గం పుంగనూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ జయరామయ్య టీడీపీ లోని రెండు వర్గాలకు నచ్చ చెప్పారు. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి పుంగనూరులో చెక్ పెట్టాలని ప్రత్యేక ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సొంత పార్టీలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా చీకడం తో ఆ నియోజకవర్గం ఇన్ చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారని తెలిసింది.
మొత్తం మీద పుంగనూరులో పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు కి సొంత పార్టీలోనే తలనొప్పి మొదలైంది. పుంగనూరుకు వెళ్లిన మంత్రి రాంప్రపాద్ రెడ్డిని అక్కడ ఏం జరిగింది అని చంద్రబాబు ఆరా తీశారని తెలిసింది. మొత్తం మీద పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు రెండుగా చీలిపోతే మొదటికే మోసం వస్తోందని, అది వైసీపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు అలర్ట్ అయ్యారని తెలిసింది.












Click it and Unblock the Notifications