రాజధానులకు చంద్రబాబు కౌంటర్- కలిసొచ్చిన జలజగడం- జగన్ ప్లాన్ కు చెక్ ఇలా
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్లాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు దానికి కౌంటర్ గా దిమ్మతిరిగే ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎలాగో మూడు రాజధానుల ప్రక్రియ ఆలస్యం అవుతుండటం, కోర్టుల్లో వివాదాలు కూడా ఇప్పుడే తేలే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు తన వ్యూహాన్ని అమలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు తెలుస్తోంది. తాజాగా తెరపైకి వచ్చిన ఏపీ-తెలంగాణ వాటర్ వార్ ను సొమ్ము చేసుకుంటూ చంద్రబాబు మొదలుపెట్టిన కౌంటర్ అటాక్ ఇప్పుడు వైసీపీ సర్కార్ ను ఇరుకుపెడుతోంది.

మూడు రాజధానులతో టీడీపీ కుదేలు
2019 ఎన్నికల్లో అమరావతి అజెండాతో ముుందుకెళ్లిన టీడీపీని ప్రజలు తిరస్కరించడంతో వైసీపీ మూడు రాజధానుల ప్లాన్ ను ఆరునెలల్లోనే అమల్లో పెట్టేసింది. దీంతో ఇందులో ఏ ఒక్క రాజధానినీ వ్యతిరేకించలేక, సమర్ధించలేక టీడీపీ ఇరుకున పడింది. ఆరంభంలో మూడు రాజధానుల ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా ప్రజల్లో స్పందన లేకపోవడం, కరోనా రావడంతో తాత్కాలికంగా దాన్నీ పక్కనపెట్టేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ దారుణ పరాజయాలు ఎదురుకావడం, ఇప్పుడే సార్వత్విక ఎన్నికలు లేకపోవడంతో టీడీపీ వ్యూహరచనకు కావాల్సినంత సమయం దక్కింది.

కలిసొచ్చిన రాయలసీమ లిఫ్ట్ పోరు
రాయలసీమ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ను తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో తమకు ఓట్లు, సీట్ల పరంగా చూసుకున్నా సీమలో పరిస్ధితులు అంత అనుకూలంగా లేవు. సీమ కంటే కోస్తాలోనే టీడీపీకి అనుకూలమైన పరిస్ధితులున్నాయి. కోస్తాలో ఉన్నా కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాలో టీడీపీకి మొన్నటి వైసీపీ హవాలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. దీంతో ప్రకాశం జిల్లా నుంచే తమ కౌంటర్ అటాక్ ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రాయలసీమ లిఫ్ట్ పై ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు లేఖ రాయించింది.

మూడు రాజధానులకు టీడీపీ కౌంటర్ ప్లాన్
వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ప్లాన్ కు కౌంటర్ ఇవ్వలేక ఇన్నాళ్లూ ఇబ్బందులు పడిన టీడీపీకి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ రూపంలో మంచి అవకాశం దక్కింది. రాయలసీమ లిఫ్ట్ తో ప్రయోజనం పొందే నాలుగు జిల్లాలతో పోలిస్తే కోస్తాలోని మిగతా జిల్లాలకు నష్టమేనని టీడీపీ భావిస్తోంది. అందుకే సీమ లిఫ్ట్ ప్రయోజనం లభించని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో తమకు నీరిచ్చాకే సీమకు ఇవ్వాలని వైసీపీ సర్కార్ కు మెలిక పెట్టింది. రాయలసీమ కంటే దారుణంగా కరవు పరిస్ధితులు ఎదుర్కొనే ప్రకాశం జిల్లాలో ఎప్పుడో మొదలైన వెలిగొండ వంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సీమ లిఫ్ట్ పై వైసీపీ సర్కార్ దృష్టిపెట్టడాన్ని కూడా టీడీపీ జనంలోకి తీసుకెళుతోంది. దీంతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి మంచి మైలేజ్ దక్కడంతో పాటు మూడు రాజధానుల్లో డొల్లతనాన్ని కూడా తెరపైకి తెచ్చినట్లవుతుంది.
Recommended Video

జగన్ ప్రాంతాల ప్లాన్ కు జిల్లాలతో చంద్రబాబు చెక్
2019 ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని అంగీకరించి, అధికారంలోకి వచ్చాక అమరావతితో పాటు మరో రెండు రాజధానుల్ని తెరపైకి తెచ్చారు జగన్. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల అభివృద్ధి పేరుతో మూడు రాజధానుల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. దీంతో చంద్రబాబుకు దీన్ని కౌంటర్ చేయడం కష్టసాధ్యంగా మారింది. చివరికి జగన్ ప్రాంతాల వారీగా రాజధానులు ఏర్పాటు చేసినా తమకు న్యాయం దక్కడం లేదని భావిస్తున్న జిల్లాల నుంచే కౌంటర్ ప్లాన్ ను చంద్రబాబు సిద్దం చేశారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచే తన ఆపరేషన్ ను చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ వల్ల తమ కంటే సీమ జిల్లాలకే ప్రయోజనం అన్న వాదనను ప్రకాశం టీడీపీ నేతల ద్వారా తెరపైకి తెచ్చారు. దీంతో ఈ వాదనకు కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ నానా కష్టాలు పడుతోంది.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
ఏపీలోని ఆ గ్రామంలో పిడకల సమరం.. చూస్తే మీరే షాక్ అవుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications