చంద్రబాబు పిట్టల దొర , తుపాకీ రాముళ్ళను మించిపోయాడు... 30 సీట్లు కూడా రావన్న విజయసాయి
ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు పిట్టలదొరలను, తుపాకీ రాముళ్ళను మించిపోయాడని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఈసారి కనీసం టీడీపీకి 30 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
గ్రామాల్లో ప్రజలకు వినోదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకి రాముళ్లను చంద్రబాబు మించిపోయారని ఎద్దేవా చేసిన ఆయన చంద్రబాబుపై ఒంటికాలిపై లేచారు. తన అనుకూల మీడియాలో ప్రధాని రేసులో ఉన్నట్లు చంద్రబాబు కథనాలు రాయించుకుంటున్నారని మండిపడ్డారు . ఆయన ప్రధాని కావడం ఏమోకానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయమని చెప్పిన విజయసాయి రెడ్డి ఏపీలో టీడీపీకి మరీ 30 స్థానాలే వస్తాయని చెప్పి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. .

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ..''ఊహకందని కోతలతో గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచే పిట్టల దొరలు, తుపాకీ రాముళ్లను మించి పోయాడు చంద్రబాబు. రాష్ట్రంలో కనీసం 30 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సీన్ లేదు. అనుకూల మీడియాతో ప్రధాని రేసులో ఉన్నాడని 'కలల' కథనాలు రాయించుకుంటున్నాడు. ప్రధాని పదవేమో కానీ జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం'' అని ట్వీట్ చేశారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications