చంద్రబాబు బ్లాక్‌మనీ వ్యాఖ్య: 'అసలు జగన్‌కు ఉలుకెందుకు, తెలుస్తోంది'

విజయవాడ: రూ.500, రూ.1000 నోట్లకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం అన్నారు.

గత మూడు నాలుగు రోజులుగా నల్ల ధనం విషయమై ఏపీలో చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. నల్లధనం వెల్లడించిన వారిలో ఓ తెలుగువాడు ఏకంగా రూ.10వేల కోట్లు వెల్లడించారని టిడిపి నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu black money comments: Behind YSRCP counter!

దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. మంత్రులు నేరుగా జగన్ పేరు చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎవరి పేరు చెప్పలేదు. జగన్ పేరు చెప్పడంతో వైసిపి నేతలు మంత్రుల పైన ధ్వజమెత్తారు. ఎదురు దాడికి దిగారు. రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు కూడా ఉండవద్దని చంద్రబాబు అన్నారు. దీనిని కూడా వైసిపి ప్రశ్నించిందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. చంద్రబాబు మాటలకు జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. వైసిపి నేతలు భారీగా అవినీతి సొమ్ము వెనుకేసినట్లు స్పష్టమవుతోందన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువగా సంపాదించి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+