Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో వందే భారత్, రైల్వే జోన్, ఆ ప్రాజెక్టులు-రైల్వే మంత్రికి చంద్రబాబు..!

ఏపీకి తాజాగా బడ్జెట్ లో ప్రకటించిన పలు రైల్వే(railway) ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచేందుకు వీలుగా సీఎం చంద్రబాబు (Chandrababu)కేంద్రానికి పలు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇవాళ ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ తో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అలాగే తాజాగా బడ్జెట్ లో ప్రకటించిన ప్రాజెక్టుల్లో కీలక మార్పుల్ని కూడా చంద్రబాబు రైల్వే మంత్రికి సూచించారు.

రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టుల పూర్తి, కొత్త రైలు మార్గాలు, సర్వీసులు నడపాలని చంద్రబాబు రైల్వే మంత్రిని కోరారు.
బడ్జెట్ లో ప్రకటించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ల గురించి భేటీలో ప్రస్తావనకు వచ్చింది. బెంగళూరు-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడారును తిరుపతిని కనెక్ట్ చేసేలా చూడాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా అడిగారు.

Chandrababu Calls on Ashwini Vaishnaw Pitches for South Coastal Railway Zone and Rail Connectivity

అలాగే తాడిపత్రి నుంచి ముంబై జేఎన్ పీటీ పోర్టుకు అరటి ఎగుమతులకు వీలుగా 50 శాతం రాయితీపై ఖాళీ రీఫర్ కంటైనర్లు కేటాయించాలని సీఎం కోరారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ మెగా కోచింగ్ టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని కూడా అడిగారు. ఉత్తర- దక్షిణ భారత్ కలిపేలా ఇటార్సీ- విజయవాడ మధ్య ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. ఏపీలోని పోర్టులను అనుసంధానిస్తూ విజయవాడ మీదుగా ఖరగ్ పూర్- చెన్నై మధ్య ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు.

Chandrababu Calls on Ashwini Vaishnaw Pitches for South Coastal Railway Zone and Rail Connectivity

రాయలసీమ సహా గిరిజన ప్రాంతాలను కనెక్టు చేసేలా వివిధ కొత్త రైల్వేమార్గాల ప్రతిపాదనల్ని ఆమోదించాలని రైల్వే మంత్రిని సీఎం కోరారు. విశాఖ-విజయవాడల మధ్య హైస్పీడ్, విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్, తిరుపతి-చిత్తూరు మధ్య హైస్పీడ్ లింక్ కారిడార్ మంజూరు చేయాలని కూడా కోరారు. హైదరాబాద్- శ్రీశైలం- మార్కాపురం కొత్త రైల్వే లైన్ ద్వారా శ్రీశైల పుణ్యక్షేత్రానికి కనెక్టివిటీని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి మీదుగా విజయవాడ-బెంగుళూరు మధ్య వందేభారత్ సర్వీసును నడపాలని అడిగారు. వివిధ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వటంతో పాటు రైలు బోగీ నిర్వహణ టెర్మినల్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+