బుల్లెట్‌లాగా దూసుకుపోతా, బొబ్బులిపులిలా..: బాబు

తిరుపతి: తనకు అండగా నిలిస్తే దేశంలో అవినీతిని నాశనం చేస్తానని, బుల్లెట్‌లాగా అవినీతి పైకి దూసుకుపోతానని, అవినీతి రహిత భారత దేశం కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుస్పష్టం చేశారు. ఎవడబ్బసోమ్ము అని దొచుకుంటున్నారు. అవినీతి బారి నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఈ కాంగ్రెస్ అనకొండల భారీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ఒక బొబ్బిలిపులిగా ఎదుర్కొందామని, ఒక మేజర్ చంద్రకాంత్‌గా రావాలని, కొండవీటి సింహాలయి నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న ప్రజా గర్జన సభలో ఆయన ప్రసంగించారు.

ఎన్టీఆర్ దగ్గరే నేర్చుకున్నా

తాను క్రమశిక్షణ ఎన్టీ రామారావు దగ్గర నేర్చుకున్నాని చంద్రబాబు అన్నారు. తిరుపతి శ్రీవారిని దర్శించుకుని అవినీతి నుంచి ఈ దేశాన్ని కాపాడమని కోరానని ఆయన అన్నారు. కుటుంబాన్ని పట్టించుకొకుండా ప్రజ సేవలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెసుకు వ్యతిరేక పవననాలు వీస్తున్న రోజుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని అందలం ఎక్కించారని, అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ ఘోరంగా ఓటమి పాలైతే మన రాష్ట్ర ప్రజలు మాత్రం ఆ పార్టీని నమ్మి ఆదరించారని, ఎక్కడా రాకపోయినా ఆంధ్రప్రదేశ్ మనకు అండగా ఉంటుందని కాంగ్రెస్ అనుకునే రోజులు పోయాయిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu Naidu

తను ఇక్కడే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని అన్నారు. తిరుపతి దేవుడి నగలు కూడా దోచుకుంగున్న కాంగ్రేస్ దొంగలు, ఆంధ్రప్రదేశ్‌ను శ్మాశానాంధ్ర ప్రదేశ్ గా చేసిన ఘనత కాంగ్రేస్‌దేనని ఆయన అన్నారు. భర్త, అత్తా లేని సోనియా గాంధీ మీద జాలి పడి ఓట్లు వేస్తే దేశాన్ని మింగేసే అనకొండ లాంటి నాయకుల్ని తయారు చేసిందని, అందులో ఒక అనకొండే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, వైయస్ చేసిన అవినీతి ఇంతా అంతా కాదని, ఆయన చేసిన అవినీతిని చెప్పుకుంటే పోతే ఒక రోజు పడుతుందని, ఆయన వెళ్తూ వెళ్తూ ఆ ఇంట్లో ఒక అనకొండను తయారుచేసి వెళ్ళారని, ఆ అనకొండే జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

సెల్‌ఫోన్లు తెచ్చా..

16 నెలలు జైలుకు వెళ్లి వచ్చిన జగన్‌కు సిగ్గు లేదని, ఆయన పెట్టిన సభలకు వెళితే పాపం చుట్టుకుంటుందని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ నేతలు కోట్ల కోట్లు రూపాయల దోచుకుని జలయజ్ఞం పేరిట దొంగ యజ్ఞం చేశారని ఆయన అన్నారు. సెల్ ఫోన్లు తీసుకొచ్చాం, కమ్యూనికేషన్ పెంచామని, మళ్ళి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ దేశాన్ని ప్రపంచంలోనే మేటి దేశంగా మారుస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన యువత మట్టిలో మాణిక్యలు, కానీ ఎవరికీ ఉద్యోగాలు లేవని, టీడీపీ అధికారం లోకి వస్తే యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒక చైనా, ఒక జపాన్ కన్నా మన యువత ప్రతిభ గలదని బాబు కొనియాడారు.

వాటికన్ సిటీగా మార్చేస్తా...

తిరుపతిని వ్యాటికన్ సిటిగా మార్చి చూపిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన చిత్తూరు రుణం తీర్చుకంటానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించిన రాజీవ్ యువకిరణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా అంటూ బాబు ప్రశ్నించారు. ఎక్కడ కిరణాలు కనిపించడం లేదని కిరణ్‌ను ఎద్దేవా చేశారు. తాము కాంగ్రెస్ దొంగల్లా కాదని, రైతులకు తగిన గిట్టు బాటు ధర కల్పిస్తామని, మహిళల్ని ఆదుకుంటామని, మగవారితో సమానంగా ఆడవాళ్ళను పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన సభ ప్రారంభానికి ముందు అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సభా ప్రాంగణమంతా పసుపు రంగు దిద్దుకుంది. అంతకు ముందు ఆదివారం ఉదయం తిరుమలలో చంద్రబాబు నాయుడు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. తర్వాత తన కాన్వాయ్‌లో సభాప్రాంగనానికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+