• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పచ్చని కొండల్లో విష బీజాలు నాటారు, బాబు పేరు వింటేనే ఉలికిపాటు.. పార్ట్-3 పోస్ట్‌లో విజయసాయిరెడ్డి..

|

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై మరోసారి ఫైరయ్యారు వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి. గిరిజనులను మోసం చేసింది బాబే అంటూ ధ్వజ మెత్తారు. ఆ సామాజిక వర్గానికి బాబు చేసిన అన్యాయంపై విడతలవారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల రెండు పార్టులను పోస్ట్ చేయగా.. తాజాగా మరో పోస్ట్ గురువారం రాత్రి పోస్ట్ చేశారు. అందులో అడవి బిడ్డలకు చంద్రబాబు చేసిన మోసంపై విమర్శలు చేశారు. గిరిపుత్రులకు బాబు మోసం చేశారని.. వారి గుండెల నిండ వైఎస్ఆర్, జగన్ ఉన్నారని స్పష్టంచేశారు.

గిరిపుత్రులకు ఆపన్నహస్తం..

గిరిపుత్రులకు ఆపన్నహస్తం..

వైఎస్ఆర్ చేయూత పకంతో పేదరికానికి శాశ్వతంగా చెక్ పెట్టబోతున్నామని విజయసాయిరెడ్డి వివరించారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ. 18 వేల 750 చొప్పున నాలుగేళ్లపాటు లబ్దిదారుల ఖాతాలో నగదు జమచేస్తామని పేర్కొన్నారు. ఇదీ వారు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు సాయ పడుతోందని తెలిపారు.

ఆయన పేరు వింటేనే ఏజెన్సీలో ఉలికిపాటు

ఆయన పేరు వింటేనే ఏజెన్సీలో ఉలికిపాటు

చంద్రబాబు పేరు వింటేనే ఏజెన్సీ ఉలిక్కిపడుతోందని పార్ట్-3లో విజయసాయిరెడ్డి స్టార్ట్ చేశారు. బాబు మోసం చేసిన వారిలో గిరిజనులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మండలి వస్తుందని.. గిరిజనులను ఎమ్మెల్సీ చేస్తానని కబుర్లు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి ఎమ్మెల్సీ కేటాయించలేదు అని ప్రశ్నించారు. చివరి ఆరునెలల్లో ఒకరినీ మంత్రి చేయాల్సి వచ్చినా అతనిని ఎమ్మెల్సీ చేయకపోవడంతో పదవీ వదులుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

ఎన్టీఆర్ లాగే గిరిపుత్రులను మోసం..

ఎన్టీఆర్ లాగే గిరిపుత్రులను మోసం..

ఎన్టీఆర్ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచినట్టే గిరిజనులను చంద్రబాబు వంచించాడని సాయిరెడ్డి ఆరోపించారు. ఇదివరకు హరికృష్ణను మంత్రి చేయాల్సిన సమయంలో కూడా అతనికి చట్టసభల్లో చోటు కల్పించలేదన్నారు. దీంతో హరికృష్ణ కూడా పదవీ కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చంద్రబాబు మార్క్ నైజం అని ఉదహరించారు. గిరిజన తండాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పినా బాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదన్నారు. అంతేకాదు తనకు ఓటేయలేదు అని. వారికి ఎందుకు పనిచేయాలని బహిరంగ ప్రకటనలు ఇచ్చిన సంకుచిత స్వభావి చంద్రబాబు అని ఫైరయ్యారు.

స్టేజీ మీద మహిళపై దాడి చేసే దుస్సహసం..

తూర్పుగోదావరి జిల్లాలో గిరిజన మహిళ స్టేజీ మీద ఉండగానే మైక్ తీసుకున్నాడు. కొట్టడానికి కూడా చేయ్యి ఎత్తాడంటే చంద్రబాబు నైజం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. గిరిజనుల అభివృద్ది కోసం చర్యలు తీసుకోవాలని కోరితే...మహిళ అని కూడా ప్రవర్తించారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఎత్తేయడంతో.. గిరిజన విద్యార్థులు ఆందోళన బాటపట్టారని పేర్కొన్నారు. దీంతో చాలా మంది విద్యకు దూరమయ్యారని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వ్చిన తర్వాత ఫీజు బకాయి తీర్చడమేగాక.. ఒక్కొక్కరీకి రూ.20 వేలు అందజేశామని తెలిపారు.

జీవో 97 ఇచ్చింది మీరు కాదా.. బాబూ

ఏజెన్సీని ధ్వంసం చేసే బాక్సైట్ తవ్వకాల కోసం జీవో 97 ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కొందరు గిరిజనులను చెరదీసి.. ఆ సామాజికవర్గంలోనే కొట్లాట పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని గుర్తుచేశారు. పచ్చని కొండల్లో విష బీజాలు నాటాడని తెలిపారు. చంద్రబాబు హయాంలో అరకు, పాడేరు, చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు ఉండేవారు కాదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తున్నామని తెలిపారు.

దత్తత తీసుకున్న గ్రామానికీ కూడా ఏమీ చేయని బాబూ..?

దత్తత తీసుకున్న గ్రామానికీ కూడా ఏమీ చేయని బాబూ..?

అరకులో చంద్రబాబు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని.. కానీ ఆ గ్రామానికి కూడా మంచినీటి వసతి కల్పించలేకపోయాడని విమర్శించారు. బాబు హయాంలో గిరిజనులకు స్పెషల్ డీఎస్సీ లేదు, గిరిజనుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించలేదు అని మండిపడ్డారు. మావోయిస్టుల పేరుతో గూడేల ధ్వంసం చేయడం, అధికారంలోకి పదవులు ఇస్తామని చెప్పడం, మొత్తంగా చంద్రబాబు గిరిజన ద్రోహి అని విజయసాయిరెడ్డి ఫైర్యారు. పార్ట్-2, పార్ట్-1లో కూడా గిరిజనులకు చంద్రబాబు చేసిన మోసాలను చూపాడు.

English summary
tdp chief chandrababu naidu cheat tribal community, ycp leader vijayasai reddy alleged. he posted part-3 on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X