కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదిరిందయ్యా చంద్రం...కొత్త ఇల్లు..కొత్త నిర్ణయం.ఇక పెద్దిరెడ్డే టార్గెట్టా..?

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. వైసీపీ పూర్తి స్థాయిలో కుప్పం పైన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అక్కడ ఇన్ ఛార్జ్ గా ఉన్న చంద్రమౌళి కుమారుడు భరత్ ను ఎమ్మెల్సీ చేసింది. వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా కుప్పంలో రాజకీయం నడుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

కుప్పం పైన చంద్రబాబు కీలక నిర్ణయాలు

కుప్పం పైన చంద్రబాబు కీలక నిర్ణయాలు

కుప్పం పార్టీ నేతలతో మున్సిపల్‌ ఎన్నికలపై పోస్టు మార్టం నిర్వహించారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని, అది కూడా పది నెలల్లోపే జరుగుతుందని చంద్రబాబు ప్రకటించారు. వీలైనన్ని ఎక్కువరోజులు కుప్పంలోనే గడుపుతూ, క్షేత్ర స్థాయి పర్యటనలతో పార్టీ బలోపేతానికి స్వయంగా రంగంలో దిగుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కనీవినీ ఎరుగని స్థాయిలో అరాచకాలకు పాల్పడిందని, ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో ఇటువంటి ఎన్నికల వాతావరణాన్ని తాము ఏనాడూ చూడలేదని స్థానిక నేతలు ఆయనకు వివరించారు.

వైసీపీ టార్గెట్ చేయటంతో...

వైసీపీ టార్గెట్ చేయటంతో...

స్థానిక నాయకత్వంలో కొన్ని మార్పులు అవసరమని వారు చెప్పారు. నాయకత్వంలో మార్పుల అవసరం తనకూ కనిపిస్తోందని, కొత్త తరానికి ప్రాతినిధ్యం ఇస్తూ మార్పుచేర్పులు చేస్తానని చంద్రబాబు వారికి చెప్పారు. కుప్పంలో పార్టీని, కేడర్‌ను పట్టించుకునేవారు ఎవరూ లేకుండా పోయారు. ఒకప్పుడు క్రియాశీలంగా పనిచేసిన వారందరూ ఇప్పుడు ధైర్యం కోల్పోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన బొమ్మ పెట్టుకుని, తన పేరుతోనే పబ్బం గడుపుతున్నారు తప్ప, సొంతంగా ప్రజల్లోకి వెళ్లి, కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారు ఎవరూ కనబడడంలేదన్నారు.

కోవర్టులపై కీలక వ్యాఖ్యలు

కోవర్టులపై కీలక వ్యాఖ్యలు


కుప్పంలో ఈ వరుస ఓటములకు ప్రధాన కారణం అదేనని చెప్పారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదన్నారు. తొలుత ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎలా తిరిగారో..ఇప్పుడు సైతం అలాగే నియోజకవర్గంలోని గ్రామగ్రామానా పర్యటించి, కేడర్‌తో పాటు ప్రజలనూ కలుస్తానని వెల్లడించారు. దేని గురించి చెప్పాలనుకున్నా కార్యకర్తలు, క్షేత్ర స్థాయి నాయకులు నేరుగా తన తోనే టచ్‌లో ఉండండంటూ సూచించారు. తానే అందరి బాగోగులు చూస్తానని... మీతో కలసి నడుస్తానని... ఎవరూ అధైర్యపడొద్దంటూ... మీవెంటే తాను ఉంటానంటూ చంద్రబాబు కుప్పం శ్రేణులకు భరోసా ఇచ్చారు.

ఇక కొత్త ఇల్లు..ప్రత్యేకంగా ఫోకస్

ఇక కొత్త ఇల్లు..ప్రత్యేకంగా ఫోకస్

పార్టీలో కొన్నిచోట్ల కోవర్టులు తయారయ్యారు. వారిని ఏరిపారేస్తా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెప్పారు. కుప్పంపై అధికార పార్టీ అనేక నెలలుగా తీవ్రంగా దృష్టి కేంద్రీకరించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్థానిక నేతలు అతి విశ్వాసం తో వ్యవహరించారని, దానివల్లే కుప్పం మునిసిపల్‌ ఎన్నికల్లో పరాజయం చవిచూడాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. వైసీపీ తనను కుప్పంలో రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తోందనే అంచనాకు వచ్చిన చంద్రబాబు.. తాను కుప్పం ను నిర్లక్ష్యం చేస్తే మొత్తానికే నష్టం జరుగుతుందని గ్రహించారు.

Recommended Video

Chandrababu Cried Issue : Vallabhaneni Vamsi Apologizes || Oneindia Telugu
పెద్దిరెడ్డిని దెబ్బ తీసే విధంగా పుంగనూరులో

పెద్దిరెడ్డిని దెబ్బ తీసే విధంగా పుంగనూరులో

ఫలితంగా.. కుప్పం పైన ఫోకస్ పెట్టారు. అటు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి సైతం కుప్పంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కుప్పంలో ఎలాగైనా చంద్రబాబు ను ఓడించాలని పెద్దిరెడ్డి.. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. తన సొంత జిల్లా.. సొంత నియోజకవర్గంలో పట్టు జారకుండా చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ కుప్పంలో పూర్తిగా పార్టీ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు తాజా నిర్ణయంతో వైసీపీ వ్యూహాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. దీనికి ప్రతిగా ఇప్పుడు వైసీపీ ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
TDP chief Chandrababu took a crucial decision and announced that he would build his own house in Kuppam, which would also take place within ten months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X