హెచ్చరిస్తే, కేసీఆర్ తెస్తానన్నారు: బాబు, కేటీఆర్ ధీటుగా
హైదరాబాద్: విభజన సరిగా జరగలేదని, ఇలా విభజన చేస్తే ఇబ్బందులు వస్తాయని తాను పలుమార్లు హెచ్చరించానని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం అన్నారు. ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెరాస, తెలంగాణ సీఎం కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.
విద్యుత్ సమస్యలు తలెత్తుతాయని ముందే చెప్పానని అన్నారు. అయితే, తెరాస నేతలు మాత్రం వాటిని పట్టించుకోకుండా తాము ఉత్పత్తి చేసుకుంటామని చెప్పారని చెప్పారు. తెలంగాణలో కరెంట్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, సమస్యలు వస్తాయని అప్పుడే చెప్పానన్నారు. విద్యుత్ సెక్టారులో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు.
రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదన్నారు. సరైన పరిష్కారాలు చూపకుండా విభజన చేయడం వల్లనే సమస్యలు వస్తున్నాయన్నారు. ప్రజలను ఒప్పించకుండానే విభజన చేశారని ఆనాడే చెప్పామన్నారు. తెలంగాణలోని కరెంట్ కష్టాలకు తాను ఎలా కారణం అవుతానని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నా పైన లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఉన్న అభివృద్ధి తమ హయాంలో జరిగిందే అన్నారు. కరెంట్ సమస్యలు వస్తాయని ముందే చెబితే.. తాము చత్తీస్‌గఢ్ నుండి తీసుకు వస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఏపీలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము 700 మెగావాట్ల విద్యుత్ కొన్నామని, కేంద్రంతో మాట్లాడి మరో రెండువందల మెగావాట్లు తెచ్చుకున్నామన్నారు. కేసీఆర్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిలో టీడీపీది కీలక పాత్ర అన్నారు.
ధీటుగా కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీడీపీ, కాంగ్రెస్ నేతలకు బహిరంగ లేఖ రాశారు. 22 ప్రశ్నలతో ఆయన లేఖ రాశారు. విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమన్నారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్, టీడీపులు తమ పార్టీని బద్నాం చేస్తున్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనులు ఉన్నప్పటికీ థర్మల్ విద్యుత్ ప్లాంటు సామర్థ్యం ఎందుకు పెంచలేదన్నారు. పీపీఏలు రద్దు చేసినా ఎందుకు మాట్లాడలేదన్నారు. సీలేరు, కేటీపీఎస్ నుండి రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వడం లేదన్నారు.












Click it and Unblock the Notifications