వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టమైన కథానాయిక శ్రీదేవి: చంద్రబాబు, శ్రీదేవే స్ఫూర్తి అని రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. అందాల తార శ్రీదేవి (54) గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

Recommended Video

హార్ట్ ఎటాక్‌‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత!!

శ్రీదేవి మృతిపై నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉన్న ఆయన శ్రీదేవి మృతిపై స్పందించారు.

ఎంతో ఎత్తుకు ఎదిగారని

ఎంతో ఎత్తుకు ఎదిగారని


బహుభాషా నటిగా, ముఖ్యంగా తెలుగువారికి అత్యంత ఇష్టమై కథా నాయికగా ఎదిగారని అన్నారు. అసమానమైన తన అభినయంతో దేశం గర్వించదగ్గ నటిగా ఎదిగారని అన్నారు.

శ్రీదేవి ఎంతో మందికి స్ఫూర్తి

శ్రీదేవి ఎంతో మందికి స్ఫూర్తి

శ్రీదేవి మృతిపై సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు నేత రోజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనలాంటి ఎంతో మందికి శ్రీదేవి స్ఫూర్తి అని అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రధాని మోడీ సంతాపం

ప్రధాని మోడీ సంతాపం

శ్రీదేవి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. సినీ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి, అత్యద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేశారని ఆన అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి కోవింద్ సంతాపం

రాష్ట్రపతి కోవింద్ సంతాపం

శ్రీదేవి మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. "శ్రీదేవి ఇక లేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. లక్షలాది మంంది అభిమానులను ఆవేదనుక గురిచేసింది. మూండ్రమ్ పిరై, లమ్షే, ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాల్లో ఆమె నటనన ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu has condoled the death of actress Sridevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X