పిల్లకాకి: జగన్‌పై బాబు, వెంట మహేష్ బావ(పిక్చర్స్)

తెనాలి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ప్రజల పొట్ట కొట్టిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడించి తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పాలని పిలుపు నిచ్చారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్‌లో రోడ్ షో నిర్వహించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో.. పిల్లకాకి.. అతడికి ఏమీ తెలియదని ధ్వజమెత్తారు. జగన్ తన కోసం పార్టీ పెడితే, తాను జనం కోసం పని చేస్తున్నానన్నారు. ఓటర్లకు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు దొంగ నోట్లు, కల్తీ మద్యం ఇస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రాన్ని జగన్ జాగీరుగా భావిస్తున్నారని, జగన్ పార్టీలో అంత జైల్ మేట్‌లే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నో సవాళ్లు ఉన్న కొత్త రాష్ట్రంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.

కాంగ్రెస్ వైఖరి వల్ల తెలుగు జాతికి అన్యాయం జరిగిందని, ఇందుకు బదులు తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పారు. నిన్న మొన్నటి వరకు బిజెపిని మతతత్వ పార్టీ అని విమర్శించి ఇప్పుడు మద్దతు ఇస్తామని జగన్ చెప్పడం కేసుల నుంచి బయట పడేందుకేనన్నారు. ముస్లింలకు టిడిపి రక్షణ కవచంగా ఉంటుందని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజల శ్రేయస్సు కోసమే జనసేన స్థాపించి ఎన్నికలలో పోటీ చేయకుండా టిడిపి- బిజెపి కూటమికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

చంద్రబాబు రోడ్ షో

చంద్రబాబు రోడ్ షో

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ప్రసంగం

చంద్రబాబు ప్రసంగం

రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి ప్రజల పొట్ట కొట్టిన కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ఎన్నికలలో చిత్తు చిత్తుగా ఓడించి తెలుగు జాతి పౌరుషాన్ని చాటి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు.

బాబుతో ఎంపి అభ్యర్థి గల్లా జయదేవ్

బాబుతో ఎంపి అభ్యర్థి గల్లా జయదేవ్

సోమవారం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్‌లో రోడ్ షో నిర్వహించారు. బాబు వెంట ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు బావ, టిడిపి ఎంపి అభ్యర్థి గల్లా జయదేవ్ ఉన్నారు.

చంద్రబాబు అభివాదం

చంద్రబాబు అభివాదం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో.. పిల్లకాకి.. అతడికి ఏమీ తెలియదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

జగన్ తన కోసం పార్టీ పెడితే, తాను జనం కోసం పని చేస్తున్నానన్నారు. ఓటర్లకు వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు దొంగ నోట్లు, కల్తీ మద్యం ఇస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు.

టోపీ పెట్టిన బాబు

టోపీ పెట్టిన బాబు

ముస్లింలకు టిడిపి రక్షణ కవచంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వైఖరి వల్ల తెలుగు జాతికి అన్యాయం జరిగిందని, ఇందుకు బదులు తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పారు.

బాబు ప్రసంగం

బాబు ప్రసంగం

కాంగ్రెస్ వైఖరి వల్ల తెలుగు జాతికి అన్యాయం జరిగిందని, ఇందుకు బదులు తీర్చుకునే సమయం వచ్చిందని చెప్పారు. నిన్న మొన్నటి వరకు బిజెపిని మతతత్వ పార్టీ అని విమర్శించి ఇప్పుడు మద్దతు ఇస్తామని జగన్ చెప్పడం కేసుల నుంచి బయట పడేందుకేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+