మోడీకి చంద్రబాబు ఝలక్ ? వక్ఫ్ బోర్డుకు కీలక ఆదేశాలు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం సాయంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీయిస్తున్న చంద్రబాబును ఓ విషయంలో మాత్రం అదే కేంద్రం ఇరుకునపెట్టింది. ముఖ్యంగా జగన్ ను కాదని గతేడాది ఎన్నికల్లో బీజేపీతో కలిసినా తమవైపు మొగ్గిన ముస్లింలను వంచించేలా కేంద్రం వక్ఫ్ చట్టం సవరణలు చేయడం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజాగా దీనికి విరుగుడుగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం తాజాగా పార్లమెంట్ లో ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణల ప్రకారం రాష్ట్ర స్ధాయిలో కానీ, కేంద్ర స్దాయిలో కానీ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల్ని కూడా నియమించేలా నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్ వ్వవహారాల్లో పారదర్శకత కోసమంటూ కేంద్రం దీన్ని సమర్ధించుకుంది. అయితే రాష్ట్రంలో కూటమి మిత్రపక్షమైన టీడీపీ ఈ సవరణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు బిల్లులో ఈ సవరణ తీసేయాలని కూడా కోరింది. అయితే మోడీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు.

Chandrababu decides not to appoint non-muslims in ap wakf board against centre s recent act

దీంతో వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. అయితే కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లును పార్లమెంట్ లో అండగా నిలిచిన టీడీపీ, జనసేనపై రాష్ట్రంలో ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు, ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకం వద్దని బోర్డు ఛైర్మన్ అజీజ్ ను ఆదేశించారు. దీంతో ఆయన ఈ విషయంపై ప్రకటన చేశారు.

Take a Poll

అదే సమయంలో పార్లమెంట్ లో వక్ఫ్ చట్ట సవరణ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని లీజుకు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడంపైనా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ దీనిపైనా క్లారిటీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డుతో పాటు సంబంధిత మసీదుల ముతవల్లీలు, ప్రభుత్వం అంగీకరిస్తేనే ఆయా ఆస్తుల్ని లీజుకు ఇస్తామనని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+