వైసీపీ పాలనలో నేతన్నలకు తీరని ద్రోహం .. వారి బ్రతుకులు చీకట్లో, నేతన్నల దుస్థితిపై చంద్రబాబు
ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతను ఆదరించాలని పలువురు ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రస్తుత నేతన్నల దయనీయ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో నేతన్నల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు పోగును వస్త్రంగా మరచి మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.

టీడీపీ పాలనలో నేతన్నలకు చేయూతనిచ్చాం
ఆంధ్రప్రదేశ్లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకు ఎంతగానో చేయూతనిచ్చామని చెప్పిన చంద్రబాబు, టిడిపి పాలనలో నేతలకిచ్చే త్రిఫ్టును 8 శాతం నుంచి 16 శాతానికి పెంచామని, అలాగే నూలు పై సబ్సిడీని 10 శాతం నుంచి 40 శాతానికి పెంచామని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీని అమలు చేశామని చంద్రబాబు వెల్లడించారు. చేనేత కార్మిక సంక్షేమం కోసం టిడిపి హయాంలో ఎంతగానో కృషి చేశామని చెప్పుకున్న చంద్రబాబు పనులు లేని వర్షాకాలానికి కూడా భృతి అందించామని స్పష్టం చేశారు .

ఏడాదికి 50 వేలకు పైగా రాయితీలను అందించాం
50 ఏళ్లకే పింఛన్ ఇచ్చామని, ఆదరణ పథకం ద్వారా పనిముట్ల అందజేసి అండగా నిలిచామని, టిడిపి హయాంలో ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి 50వేలకు పైగా రాయితీలు అందించామని పేర్కొన్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నేతన్నల పరిస్థితి చూస్తే మనసు కలిచివేస్తోందని పేర్కొన్న చంద్రబాబు ఏపీలో చేనేత కార్మికులకు 50 వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి 24 వేలతో సర్దుకోమని చెబుతూ తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. నేతన్నల అభివృద్ధికి, అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడి లేదని, వారి అభివృద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలను రాయితీలను నేతన్నలకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

వైసీపీ హయాంలో నేతన్నల బ్రతుకులు చీకట్లో
గత ఏడాది కాలంగా నేతన్నల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని, కరోనా మహమ్మారి కాటు వేయడంతో నేతన్నలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దు చేసి వైసిపి సర్కార్ చీకట్లోకి వారిని నెట్టి వేసిందని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను తిరిగి అమలు చేయాలని, నేతన్నల బ్రతుకుకు భరోసా కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
Recommended Video

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రకటన
ఇక మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేనేత కార్మికులకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత ను ధరిద్దాం, చేనేత కళారంగాన్ని ఆదుకుందాం అంటూ పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ చేనేత ధరిస్తూ తనను తాను, చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకునే విషయం తెలిసిందే. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరోమారు అందరు నేతన్నల కళాసృష్టిని గుర్తుచేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారికి అండగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!











Click it and Unblock the Notifications