ఢిల్లీలో చంద్రబాబు బిజీ, సచివాలయంలో బాలకృష్ణ హంగామా!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం హస్తినలో బిజీబిజీగా పర్యటిస్తుండగా.. ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సచివాలయంలో పుట్టిన రోజు వేడుగలు జరుపుకున్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చాంబరులో బాలకృష్ణ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు, అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాలకృష్ణ తొలిసారి సచివాలయానికి వచ్చారని చెప్పవచ్చు. బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పలువురు వరుస కట్టారు. నోటుకు వోటు వ్యవహారంపై బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుతంత్రం అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదన్నారు. దీనిని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి విషయంలో స్పందించేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications