టిపై బాబు, 'జగన్ నుండి ఒక్కరూపాయి రికవరీ చేశారా'

రూపాయి ఐనా వసూలు చేశారా?: సోమిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ము నుండి ఒక్క రూపాయి అయినా రికవరీ చేశారా అని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ధ్వజమెత్తారు.
జగన్ అవినీతిని కిరణ్ కాపాడుతున్నారని ఆరోపించారు. కిరణ్ పాలన అవినీతి ఊబిలో చిక్కుకుపోయిందన్నారు. స్వయంగా మాజీ డిజిపియే కిరణ్ సోదరులు భూదందాల పైన ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర రావుల విమర్శలకు కిరణ్ వద్ద సమాధానమే లేదన్నారు.
కిరణ్ కంటే అప్పటి ముఖ్యమంత్రి, నేటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య బెట్టర్ అనిపించుకున్నారన్నారు. ఆరు నెలల్లో నల్లారి సోదరులు అవినీతికి అడ్డులేకుండా పోయిందన్నారు. అవినీతిలో కిరణ్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి వారసుడు అని ఎద్దేవా చేశారు.
సత్తాలేని, అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. కిరణ్ చిత్తూరు వెళ్తుంటే ఒక్క కాంగ్రెసు ఎమ్మెల్యే కూడా వెంట రారన్నారు. బాలశౌరిపై ఎన్ని అవినీతి ఆరోపణలు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను కిరణ్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications