Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంతా బీజేపీ కనుసన్నల్లోనే! తెలంగాణపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ, బాబుపై విమర్శలెందుకు?

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం గురువారం రాత్రి ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి పచ్చజెండా ఊపారు. సెప్టెంబర్ 14 నుంచి ఆన్ లైన్‌లో యువనేస్తం కార్యక్రమం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు.

ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో బీపీఎస్‌ అమలుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగ భృతి, కరువు భత్యాలు

నిరుద్యోగ భృతి, కరువు భత్యాలు

పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు 151 జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో 30వేల మందికి నెలసరి జీతం వేయి నుంచి రెండు వేల రూపాయలు పెరగనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చెల్లించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు మూడు కరవు భత్యాలు పెండింగ్ లో ఉన్నాయని, ఒక కరవు భత్యం చెల్లింపునకు రూ.627 కోట్లు అవసరమని మంత్రి వెల్లడించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చేందుకు కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఆక్వా రైతులకు యూనిట్ ధర 2 రూపాయల లెక్కన ఇవ్వనున్నామని తెలిపారు. కరవు సహాయక చర్యలపై శుక్రవారం అసెంబ్లీలో చర్చిస్తామని కాలువ శ్రీనివాసులు తెలిపారు.

మోడీ-సాన్నిహిత్యం హైలెట్

మోడీ-సాన్నిహిత్యం హైలెట్

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా తెలంగాణ ముందస్తు ఎన్నికలపైనే చర్చించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్- మోడీ సాన్నిహిత్యాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు చెప్పకుండానే ముందుకు వెళ్లారని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. జోనల్ వ్యవస్ధకు ఆమోదం.. రద్దు తదనంతర పరిణామాలు చూస్తోంటే ముందుగా వేసుకున్న ప్రణాళిక లాగే ఉందని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. గవర్నర్ చేసే పనులను కూడా కేసీఆర్ చెప్పేస్తున్నారని మరో మంత్రి అన్నారు.

తెలంగాణ అభివృద్ధినే కోరుకున్నా..

తెలంగాణ అభివృద్ధినే కోరుకున్నా..

తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉందని.. గట్టి పోటీని ఇవ్వాలని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత తెలంగాణ విషయంలో ఏనాడూ వ్యతిరేకతతో వ్యవహరించలేదనే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. తెలంగాణను సాటి తెలుగు రాష్ట్రంగా.. అభివృద్ధి జరగాలనే దిశగానే వ్యవహరించామని ఆయన అన్నారు. తెలంగాణ నేతలతో చర్చించి పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

అంతా బీజేపీ కనుసన్నల్లోనే! బాబునెందుకు విమర్శించాలి?

అంతా బీజేపీ కనుసన్నల్లోనే! బాబునెందుకు విమర్శించాలి?

కాగా, బీజేపీ కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారని ఓ సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించకపోవడాన్ని సమావేశంలో రాయలసీమకు చెందిన ఓ నాయకుడు గుర్తుచేశారు. టీడీపీ ఆంధ్రపార్టీ అంటూ.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించారు. తెలంగాణలో ఏ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుందనే అనే అంశంపై ఓ నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు నేతలకు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+