• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేవు: వైసిపి ఎమ్మెల్సీ బోస్‌

By Suvarnaraju
|

తూర్పుగోదావరి:పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేవని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుబాష్‌చంద్రబోస్‌ అభిప్రాయపడ్డారు.

శనివారం రాయవరం మండలం వెదురుపాకలో మాజీ ఎమ్మెల్సీ కె.జార్జివిక్టర్‌కు నివాళి అర్పించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం తిరస్కరణకు గురి అవుతోందని అందుకే చంద్రబాబు సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడంలేదని బోస్ విశ్లేషించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, విద్యార్థులు, యవకులు...ఇలా అన్నివర్గాల ప్రజలను మోసగించిందన్నారు.

Chandrababu does not have favourable conditions in AP to go for the early elections: YCP MLC Bose

శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటానికి పాలభిషేకాన్ని చేయడాన్ని బోస్ తప్పుబట్టారు. సభాపతి స్థానంలోఉన్న వ్యక్తి ఏ రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించరాదని, స్పీకర్‌ కోడెల ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగించడమేనని బోస్ వ్యాఖ్యానించారు.

భారత రాజకీయాల్లో కులం, మతం కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయని...కులం,మతం, ప్రాంతీయం తదిదర ప్రభావాలు తాటాకుమంటల్లా తాత్కాలికమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏవిధంగా ఉంటుంది అని విషయమై బోస్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు మైలవరం నియోజకవర్గంలో వైసిపి నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం మూలపాడులో నియోజకవర్గానికి చెందిన పేద మహిళలకు వసంత కృష్ణ ప్రసాద్ మొత్తం లక్ష చీరలను పంపిణీ చేశారు.

మరోవైపు వైఎస్ఆర్ పాలనపై పై మంత్రి దేవినేని ఉమ విమర్శల వర్షం కురిపించారు. రాజన్న రాజ్యంలో ఎంపీలు, అధికారులు జైలుకెళ్ళారని మంత్రి ఉమ ఎద్దేవాచేశారు. టిడిపి ధర్మపోరాటానికి ప్రజలు వస్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు. పులిచింతలలో 45 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కృష్ణానది తీరప్రాంత, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉమ సూచించారు. గోదావరి- పెన్నా అనుసంధానం మొదటి దశకు త్వరలోనే సీఎం శంకుస్ధాపన చేస్తారని, ప్రతిపక్షనేతకు తిట్టే తీరిక తప్ప పోలవరం డ్యాం చూసే తీరిక లేదని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
East Godavari:YCP MLC Pilli Subhash Chandrabose saith that CM Chandrababu does not have conditions to go to early elections in Andhra Pradesh like in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more