ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి, దశాబ్దాల వైరం: చంద్రబాబు విఫలం

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో శానససభ్యుడు ఆదినారాయణ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ రామసుబ్బారెడ్డికి మధ్య సయోధ్య కుదర్చడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. ఇరు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు వారిద్దరిని పిలిపించి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది.

మూడు దశాబ్దాలకుపైగా జమ్మలమడుగులో రెండు కుటుంబాలు ఫాక్షన్ రాజకీయాల్లో మునిగి తేలాయి. ఆదినారాయణరెడ్డి కుటుంబానికి, రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి పచ్చగడ్డ వేస్తే భుగ్గుమంటుంది. రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలు ఎప్పుడూ వైరి పక్షాలే.

ఆ స్థితిలో జమ్మలమడుగు నేతలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రామసుబ్బారెడ్డి కుటుంబసభ్యులకు ఏ మాత్రం రుచించలేదు. వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు.

Chandrababu failed to convice Adi and Ramasubba Reddy groups

రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పి ఆయనను పార్టీలోకి చేర్చుకోవాలనే చంద్రబాబు ప్రయత్నం ఫలించలేదు. ఆదినారాయణ రెడ్డి వర్గంతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని రామసుబ్బారెడ్డి అప్పట్లోనే చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు రామసుబ్బారెడ్డి మాటలను పట్టించుకోకుండా ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.

జమ్మలమడుగులో ఫ్యాక్షన్‌ను పక్కన పెట్టి ఇరువర్గాలు కలిసి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. కానీ ఇరు వర్గాల మధ్య సయోధ్య సాధ్యపడడం లేదు. జమ్మలమడుగుతెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపులు తయారయ్యాయి.

రామసుబ్బారెడ్డి వర్గంవారిపై ఒకానొక సందర్భంలో ఆదినారాయణ రెడ్డివర్గం వారు దాడి కూడా చేశారు. దీంతో వారిద్దరి మధ్య తగాదాలు ప్రారంభమయ్యాయి. ఆ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరింది. దాంతో రామసుబ్బారెడ్డిని, ఆదినారాయణరెడ్డిని పిలిపించుకుని క్లాస్‌ తీసుకున్నారు. కలిసి పని చేయండంటూ మరోసారి హితవు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+