హామీలను డైవర్షన్ చేయటానికి చంద్రబాబు తప్పుడు ప్రచారాలు - పేర్ని నాని

ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి సీఎం చంద్రబాబు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. హామీలకు పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ కు సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదని.. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు మాజీ మంత్రి. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేయడం ఏంటని మండిపడ్డారు. ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారని నిలదీశారు.

Chandrababu s false propaganda to divert promises - Perni Nani

సుగాలి ప్రీతి హత్య కేసును పట్టించుకోకుండా.. రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగా పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారని అన్నారు పేర్ని నాని. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేబినెట్ లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు కానీ.. ఇతర అంశాలపై చర్చించారంటూ మండిపడ్డారు. నారాయణకు వైఎస్‌ వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు.. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు.. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారని.. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉందని తెలిపారు. ఇక శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారని గుర్తుచేశారు. రంగన్నకు 2+2 గన్ మెన్ లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారని ఆరోపించారు.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు? అని ప్రశ్నించారు.

మరోవైపు వైఎస్ అభిషేక్‌ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే అని వెల్లడించారు. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందాడు. వాచ్‌మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారని.. కానీ, రంగన్న గురించి కేబినెట్‌లో చర్చించారని అన్నారు. డీజీపీతో పాటు కడప నుంచి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+