మిత్రపక్షం మేమా? వైసీపీనా? పోరాటం ఉధృతమే: కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం

Subscribe to Oneindia Telugu
  బీజేపీ కి మిత్రపక్షం మేమా? వైసీపీనా?

  అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారం కేంద్రంపై వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

  ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. లాలూచీ పడేవాళ్లు ప్రజల దృష్టితో దోషులుగా మిగిలిపోతారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలే మనకు హైకమాండ్, ప్రజల ఆకాంక్షలే మనకు ముఖ్యమని నేతలకు దిశానిర్దేశం చేశారు.

  అన్యాయం అంటూ ఆగ్రహం

  అన్యాయం అంటూ ఆగ్రహం

  ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని చంద్రబాబు అన్నారు. కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.
  కేంద్రమంత్రి పీయూష్ గోయల్ టీడీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ‘ఏపీపై కేంద్రానిది వివక్షే! ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు'

  మిత్ర పక్షం మేమా? వైసీపీనా?

  మిత్ర పక్షం మేమా? వైసీపీనా?

  మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలకు కాకుండా వైసీపీ ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడంలో ఆంతర్యమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. మిత్ర పక్షం తామా? లేక వైసీపీనా అనే సందేహం ప్రజలకు కలుగుతోందని అన్నారు.

  ఆవేదనకు గురిచేస్తోంది.

  ఆవేదనకు గురిచేస్తోంది.

  ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమలు తీరును సమీక్షించాలని సీఎం తెలిపారు. ఏపీకి పార్లమెంట్ ఇచ్చిన హామీల అమలును సమీక్షించాలన్నారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. దశలవారీగా పోరాటం ఉధృతం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశంచేశారు.

  వదిలిపెట్టేది లేదు

  వదిలిపెట్టేది లేదు

  రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు వదిలిపెట్టేది లేదని.. ఇక్కడ శాసనసభ, శాసన మండలిలో, అక్కడ లోక్‌సభ, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ సమస్యలే ప్రతిధ్వనించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పార్లమెంటు జరిగేటప్పుడు ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని తర్వాత రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో పోరాటం ఉధృతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

  ఆలోగానే హోదాపై చర్చించాలి..

  ఆలోగానే హోదాపై చర్చించాలి..

  ఆర్ధిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని.. ఆర్ధిక బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధికలోటుపై చర్చించాలని సూచించారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై ఢిల్లీ వేదికగా ప్రశ్నించాలన్నారు. జాతీయ పార్టీల నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సభకు ఎవరూ గైర్హాజరు కారాదని, సభల్లో ప్రజల గొంతు ప్రతిధ్వనించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాగా, కాగా, బుధవారం నాటి పార్లమెంటు సమావేశాల్లోనూ టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలో లోకసభ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది.

  ప్రతిపక్షం చారిత్రాత్మక తప్పింది

  ప్రతిపక్షం చారిత్రాత్మక తప్పింది

  ఇక ప్రజా సమస్యలు చర్చించేందుకే శాసనసభ, మండలి, పార్లమెంటు అని చంద్రబాబు చెప్పారు. తాము పనిచేసేది ప్రజల కోసమని, ప్రతిపక్షం కోసం కాదన్న విషయం గుర్తుంచుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రతిపక్షం లేకపోయినా సభ సజావుగా, నిరాఘాటంగా జరిగిందని ప్రజలు భావించాలన్నారు. సభా సమయం వృధాకారాదని, ప్రజా సమస్యలపై చర్చకే సభలు దోహదపడాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ప్రజలు మరిచిపోయేలా చేయాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు అన్నారు. సభకు గైర్హాజరు కావడం ప్రతిపక్షం చారిత్రాత్మక తప్పిదమన్న ఆయన.. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh CM Chandrababu Naidu on Wednesday fired at centre for not giving appointment to tdp mps.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి