మొద్దు, దొంగబ్బాయ్: రాహుల్, జగన్‌పై బాబు(పిక్చర్స్)
విజయనగరం: రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టపోయిన సీమాంధ్ర నిర్మాణానికి తాను మొదటి కూలీ అవుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వివేచనతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి అధికారమిస్తే ప్రజల భద్రత, భవిష్యత్తుకు తాను బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరంలలో చంద్రబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సైకిల్ గుర్తుపై ఓటేసి, టిడిపిని భారీ మెజార్టీతో గెలిపిస్తే, ప్రజల కన్నీటిని తుడుస్తానని అన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చే బాధ్యతలను భుజాలపై వేసుకుంటానని చెప్పారు. అలా చేయలేకుంటే తనను నిలదీయాలని అన్నారు. ఏకపక్షంగా సాగిన రాష్ట్ర విభజనను నిలువరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు.
అయినా తగినంత సంఖ్యా బలం లేనందున విఫలమయ్యానని చెప్పారు. మొద్దబ్బాయ్ రాహుల్, దొంగబ్బాయ్ జగన్‌కు ఉన్నత పదవులు దక్కడం కోసం సోనియ గాంధీ రాష్ట్ర విభజన రూపంలో వికృత క్రీడ నడిపారని దుయ్యబట్టారు. పండంటి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టిన పాపం ఊరికేపోదని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అన్ని వనరులూ ఉన్న హైదరాబాద్‌ను తెలంగాణకు కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వం.. సీమాంధ్రకు రాజధానిని ఎక్కడ నిర్మించాలన్న దానిపై ఇంతవరకూ తేల్చకపోవడాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలపై ఢిల్లీ పెద్దలకున్న కసి తేటతేల్లమవుతోందని చంద్రబాబు విమర్శించారు. తల్లీ పిల్ల కాంగ్రెస్‌లను చిత్తు చిత్తుగా ఓడించి తెలుగోడి సత్తా చూపాలని చంద్రబాబు అన్నారు. టిడిపికి అధికారమిస్తే, ప్రజలకు మంచి భవిష్యత్తు, భావితరాలకు భరోసాగా నిలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

బాబుకు పుష్పగుచ్ఛం
విజయనగరం జిల్లా బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరంలలో చంద్రబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మాట్లాడుతున్న అశోక్ గజపతిరాజు
విజయనగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ సీనయర్ నాయకుడు అశోక్ గజపతిరాజు.

పూల మాలలు వేసి..
విజయనగరం జిల్లా బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరంలలో చంద్రబాబు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పూలమాలలు వేస్తున్న నాయకులు.

భారీగా హాజరైన మహిళలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో నష్టపోయిన సీమాంధ్ర నిర్మాణానికి తాను మొదటి కూలీ అవుతానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు.

విజయం మాదే
ఎన్నికల్లో ప్రజలు వివేచనతో వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి అధికారమిస్తే ప్రజల భద్రత, భవిష్యత్తుకు తాను బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాబు ప్రసంగం
తల్లీ పిల్ల కాంగ్రెస్‌లను చిత్తు చిత్తుగా ఓడించి తెలుగోడి సత్తా చూపాలని చంద్రబాబు అన్నారు. టిడిపికి అధికారమిస్తే, ప్రజలకు మంచి భవిష్యత్తు, భావితరాలకు భరోసాగా నిలుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు రోడ్‌షో
మొద్దబ్బాయ్ రాహుల్, దొంగబ్బాయ్ జగన్‌కు ఉన్నత పదవులు దక్కడం కోసం సోనియా గాంధీ రాష్ట్ర విభజన రూపంలో వికృత క్రీడ నడిపారని చంద్రబాబు దుయ్యబట్టారు. పండంటి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టిన పాపం ఊరికేపోదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications