వైసీపీది ఉగ్రవాదులను మించిన పాలన; జగన్ హయాంలో ఉత్సవవిగ్రహాలుగా సర్పంచ్ లు: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పాలన పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాక్షసులు, ఉగ్రవాదులకు మించిన పాలన వైసిపి సాగిస్తుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సర్పంచ్ ల అవగాహన సదస్సులో చంద్రబాబు జగన్ సర్కారు తీరును ఎండగట్టారు.

సర్పంచ్ ల వద్ద ఉన్న అధికారాలను తీసుకోవడానికి జగన్ ఎవరు?
ఈ సదస్సులో మాట్లాడిన చంద్రబాబు సర్పంచులు అధికారం లేకుండా చేశారని, హక్కుల కోసం వారు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. రాయలసీమ ప్రాంత జిల్లాలు సర్పంచ్ ల అవగాహన కార్యక్రమంలో చంద్రబాబు ఉగ్రవాదులను మించిన పాలన వైసిపి సాగిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్పంచ్ లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని, ఆ హక్కులను కాలరాయడానికి, సర్పంచ్ ల వద్ద ఉన్న అధికారాలను తీసుకోవడానికి జగన్ ఎవరని ప్రశ్నించారు.

సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన వైసీపీ
సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్చిందని చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను జగన్ హరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండా అడుగడుగునా అవాంతరాలు తొలగించారని, స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయొద్దని వైసిపి హుకుం జారీ చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన నేతలు పోరాటం సాగించి గెలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు స్వర్ణయుగం
టిడిపి హయాంలో గ్రామపంచాయతీలు స్వర్ణయుగంగా ఉన్నాయని, వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు అస్తవ్యస్థంగా మారాయని చంద్రబాబు విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం టిడిపి నుండి గెలుపొందిన సర్పంచ్ లు అందరూ పోరాటం సాగించాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ను, వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ సర్పంచ్ లకు అధికారాలుకుండా చేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది
వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలపై చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని క్యప్పటి వరకు ప్రజా క్షేత్రంలో పని చెయ్యాలని సూచించారు చంద్రబాబు నాయుడు.












Click it and Unblock the Notifications