ప్రస్తుతానికి టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పిన చంద్రబాబు!

2024 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ప్రతి అడుగు చంద్రబాబునాయుడు ఆచితూచి వేస్తున్నారు. టికెట్ల ఎంపిక పార్టీ ఓటమికి కారణం కారాదని ఆయన భావిస్తున్నారు. గత ఎన్నికల వరకు పార్టీలోని సీనియర్ నేతలు తమకు, తమ కుటుంబసభ్యులకు అంటూ రెండు టికెట్లు పొందేవారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం వారికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.

స్పష్టంగా చెప్పిన చంద్రబాబు

స్పష్టంగా చెప్పిన చంద్రబాబు


రెండు టికెట్లు ఆశిస్తున్న సీనియర్లందరికీ ఈ విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారు. అయినా కొందరు సీనియర్లు మాత్రం రెండు టికెట్లు ఇవ్వాలంటూ ఇంకా ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని బాబు తెగేసి చెబుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులే పోటీకి దిగితే ప్రత్యర్థులే గెలిచే అవకాశం ఉంటోంది. రెండు నియోజకవర్గాల్లోను ఖర్చు చేయడానికి కూడా వెనకాడతారు. ఒక నియోజకవర్గంపై కూడా పట్టు సాధించలేరు. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒకటే కేటాయిస్తున్నారు.

రాప్తాడు నుంచి సునీత మాత్రమే పోటీచేయాలి

రాప్తాడు నుంచి సునీత మాత్రమే పోటీచేయాలి


అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత కుటుంబం రెండు టికెట్లను కోరుతోంది. తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో నమ్మకమైన కుటుంబంగా పేరున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత మాత్రమే పోటీచేయాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి బరిలోకి దిగిన సునీత తనయుడు శ్రీరామ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిచేతిలో ఓటమి పాలయ్యారు. సునీత అయితేనే రాప్తాడులో గెలుపు అవకాశాలున్నాయని బాబు భావిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సునీత పాదయాత్ర చేస్తున్నారు.

ధర్మవరంలో టికెట్ ఇచ్చేది లేదు

ధర్మవరంలో టికెట్ ఇచ్చేది లేదు

మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో శ్రీరామ్ పనిచేసుకుంటున్నారు. అక్కడ ఇన్ ఛార్జిగా ఉన్నారు. అయినా టికెటిచ్చేది లేదని బాబు చెప్పారు. కావాలంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తానని చెబుతున్నారు. ధర్మవరంలో శ్రీరామ్ కు టికెటిస్తే రాప్తాడులో కూడా టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలో తేలింది. గెలవాలంటే కొన్ని సీట్లను కొందరు త్యాగం చేయక తప్పదని చెబుతున్నారు. గెలుపే ప్రాతిపదికగా ఈసారి కేఈ కుటుంబానికి కూడా టికెట్ ఇవ్వడంలేదు. ధర్మవరం సీటు తనకు దక్కకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేసిన శ్రీరామ్ ను చల్లబరికి రాప్తాడుకే పరిమితం చేయాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+