ఇవీ మీ లెక్కలు.. చూడండి: మోడీకి బాబు, హోదాపై 'సీరియస్' వార్నింగ్!

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు గంటన్నర పాటు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా రాజకీయ అంశంగా మారక ముందే నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.

గంటన్నర పాటు ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు పలు అంశాలను ఆయనకు వివరించారు. 12 అంశాలతో కూడిన డిమాండ్లను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచారు. అలాగే, ఏపీ బీజేపీ నేతలు ఖర్చుల వివరాలు అడగడంపై కూడా చంద్రబాబు స్పందించారు.

Chandrababu gives Narendra Modi report on drought, and Asks Special tag for AP

కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచారని తెలుస్తోంది. ప్రధానితో భేటీ సందర్భంగా ప్రత్యేకంగా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన హామీ అని, దానిని నెరవేర్చాలని లేదంటే ఇబ్బందులు తప్పవని ప్రధాని మోడీకి చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.

ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారని ఆయన అన్నారని తెలుస్తోంది. హోదా అంశాన్ని విపక్షాలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని, అది రాజకీయ అంశంగా మారక ముందే నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. అలాగే, కరువు నివారణ పైన రాష్ట్రం తీసుకున్న చర్యలను వివరించారు. కరువు నేపథ్యంలో కేంద్రం నుంచి భారీ సాయం కోరారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కరువు, ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, అమరావతి నిధులు, పారిశ్రామీక రాయితీలు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట ప్రస్తావించారు. ఈ భేటీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రాధామోహన్ సింగ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్‌ టక్కర్, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నతాధికారులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+