Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాబు యూ టర్న్, తెలియదన్న కెఈ!: అప్పుడు వద్దని, ఇప్పుడు ఓకే (పిక్చర్స్)

విశాఖ: బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇందుకోసం జీవో 97ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. కాంగ్రెస్, టిడిపిలు విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ హయాంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లోని అరకు, సప్పర్ల అటవీ ప్రాంతంలో 240 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను ఏడాదికి 4.5 మిలియన్ టన్నుల చొప్పన తవ్వి తీసేందుకు జిందాల్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది.

అనంతరం పరిణామాల కారణంగా జిందాల్‌కు తవ్వకాలకు సంబంధించిన అనుమతులు మంజూరు కాలేదు. అదే సమయంలో విదేశీ భాగస్వామ్యంతో ఏర్పాటైన అన్ రాక్ కంపెనీతో 2007 ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

 బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

2008లో సప్పర్ల, జెర్రెల ప్రాంతాల్లోని 224 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీసేందుకు కాంగ్రెస్ హయాంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అన్ రాక్‌కు తొలి దశ అనుమతులు ఇచ్చింది.

 బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

ఏడేళ్ల తర్వాత తాజాగా మొత్తం నాలుగు బ్లాకుల్లోని 1,212 హెక్టార్లలో 222 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ వెలికి తీసేందుకు ఎన్డీయే సర్కార్ అన్ రాక్‌‍కు తుది దశ అనుమతులు ఇచ్చింది.

 బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అశ్వినీ కుమార్ గురువారం జివోఎంఎస్ 97 విడుదల చేశారు.

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

2004-2014 వరకు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది.

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

2008లో తొలి దశ అనుమతులు మంజూరు చేసినా, మావోయిస్టు హెచ్చరికలు, విపక్షాల ఆందోళలు, 2009 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో కాంగ్రెస్ వెనుకంజ వేసింది.

 బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

2014 ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ కొత్త పల్లవి అందుకుంది. బాక్సైట్ తవ్వకాలను టిడిపి, చంద్రబాబు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.

 బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

అయితే, ఇప్పుడు 2014లో టిడిపి అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. కేంద్రంలోని బిజెపి కూడా బహుళ జాతి సంస్థలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు మార్గం సుగమం అయింది. మరోవైపు, బాక్సైట్ తవ్వకాల అనుమతులపై సిపిఐ అఖిల పక్ష సమావేశానికి డిమాండ్ చేస్తోంది.

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

బాక్సైట్ తవ్వకాలు - 2010లో చంద్రబాబు పరిశీలన

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు జారీ చేయడంపై తనకు ఎలాంటి వివరాలు తెలియవని, అందువల్ల ఆ విషయంపై మాట్లాడబోనని ఉప ముఖ్యమత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+