జగన్ తెచ్చిన చట్టానికి దండేసి దండం పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం అమలులోకి రావడానికి రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 3,396 కొత్త దుకాణాలతో నూతన మద్యం విధానం అతి త్వరలోనే అమలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ లో నూతన మధ్యం విధానం అమల్లోకి రానుంది. గీత కార్మికుల కోసం అదనంగా మరో 396 మద్యం దుకాణాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైంది.
2019 కంటే ముందున్న మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం మద్యం రిటైల్ దుకాణాలు నిర్వహించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే కట్టబెడుతూ అప్పట్లో ఎక్సైజ్ శాఖ చట్టాన్ని సవరించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రైవేట్ కే రిటైల్ మద్యం వ్యాపారాన్ని అప్పగించాలని ఓ నిర్ణయానికి వచ్చారు.

జగన్ తీసుకువచ్చిన జే బ్రాండ్ మద్యం విధానానికి చట్ట సవరణ చేయాల్సి ఉంది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఎక్సైజ్ శాఖ చట్టం సవరణ కోసం ఓ నిర్ణయం తీసుకొని మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ పని దినాలలో ఎక్సైజ్ శాఖ చట్ట సవరణ పై అధికారికంగా ఓ ప్రకటన చేయనున్నారు. ఇదే నెల 22, 23వ తేదీలలో ఆంధ్రప్రదేశ్ నూతన మధ్య విధానంపై అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 3,396 మద్యం దుకాణాల్లో పాటు కొత్తగా ప్రిమియం స్టోర్లు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో జే బ్రాండ్ మద్యం ఎక్కడా కనపడకుండా చేయాలని మంత్రివర్గ ఉప సంఘం సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళవారమే మనవి చేసింది. దిక్కుమాలిన జే బ్రాండ్ల మద్యం విక్రయించి గత ఐదు సంవత్సరాలలో వేల కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన జే బ్రాండ్ లిక్కర్ ఇక ఆంధ్రప్రదేశ్ లో కనపడదని సమాచారం.

గత వైసీపీ ప్రభుత్వంలో జగనే అతి పెద్ద మద్యం సిండికేట్ నడిపారని, అలాంటి మద్యం వ్యాపారం మనకు అవసరం లేదని మంత్రివర్గ ఉప సంఘం సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ నివేదిక సమర్పించిందని తెలిసింది. అతి తక్కువ ధరకు నాణ్యమైన మద్యంతో పాటు దేశంలో విక్రయించే బ్రాండెడ్ లిక్కర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఇక ముందు విక్రయించాలని, ప్రభుత్వానికి వచ్చే లాభం కంటే ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ నివేదిక సమర్పించింది.
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం వ్యాపారం వలన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే వైసీపీ నాయకులు జేబులోకి వేల కోట్ల రూపాయలు వెళ్లిందని కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పారని తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వంలో దిక్కుమాలిన మద్యం తాగి విసిగిపోయిన మందుబాబులకు చంద్రబాబు ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెబుతోందని తెలిసింది. తక్కువ ధరకు మద్యం చిక్కితే పక్క రాష్ట్రాలకు పోయే పని ఉండదని, ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని మద్యం ప్రియులు అంటున్నారు.












Click it and Unblock the Notifications