వీరి వల్ల కాదు: పోలవరంపై ట్రాన్స్‌ట్రాయ్‌కు చంద్రబాబు షాక్, నోటీసులు
పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సోమవారం గట్టి షాకిచ్చింది.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సోమవారం గట్టి షాకిచ్చింది.
ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా ముందుగు సాగడం లేదని, ఇలాంటి సమయంలో మీ కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

ట్రాన్స్‌ట్రాయ్ వల్ల కాదు
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టార్గెట్ పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు ట్రాన్స్‌ట్రాయ్‌తో కావని తేల్చి చెప్పారని తెలుస్తోంది.

ప్రత్యామ్నాయం చూస్తామన్న అధికారులు
పోలవరం ప్రాజెక్టు టార్గెట్ పనులు పూర్తి కాకపోవడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము ప్రత్యామ్నాయం చూస్తామని చంద్రబాబుకు అధికారులు చెప్పారు.

ట్రాన్స్‌ట్రాయ్‌కు నోటీసులు
పోలవరం జాప్యంపై ప్రభుత్వం సీరియస్‍గా ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్‌ట్రాయ్‌కు 60 సి కింద నోటీసులు జారీ చేసింది. పనుల జాప్యంపై సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్ట్ నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది.

2018కి నీళ్లు ఇవ్వాలంటే..
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పది రోజుల్లో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. 2018కి నీళ్లు ఇవ్వాలంటే పనులు వేగవంతం చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications