హెలికాప్టర్ నుంచి దిగుతుండగా బాబు గన్‌మన్ గన్ మిస్‌ఫైర్

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్‌మెన్ గన్ మిస్‌ఫైర్ అయింది. శ్రీకాకుళం జిల్లా తామరాపల్లిలో హెలికాప్టర్ నుంచి దిగుతుండగా ట్రిగ్గర్‌కు చేయి తగిలి గన్ మిస్‌పైర్ అయింది. ఈ సంఘటనలో ఏ విధమైన ప్రమాదమూ సంభవించలేదని సమాచారం. చంద్రబాబు నాయుడు శనివారం శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు.

దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం కనిపిస్తుందని, జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉన్నాయని అంటూ వలసలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబునాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు.

Chandrababu gunman gun misfires at Srikakulam

డ్వాక్రా సంఘాలతో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని రూపుమాపుతామని ఆయన హామీ ఇచ్చారు. జన్మభూమి స్ఫూర్తితో స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డులను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. స్మార్ట్ గ్రామం, స్మార్ట్ వార్డుల్లో భాగంగా పలు గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఇది శుభపరిణామమని ఆయన అన్నారు.

నాగరిక సమాజంలో ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి కట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉంటోందని, మరుగుదొడ్డి మాత్రం నిర్మించుకోవడం లేదని ఆయన చెప్పారు ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+