Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2026: బడ్జెట్ ఎలా ఉందంటే ? ఒక్క మాటలో తేల్చేసిన చంద్రబాబు..!

ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ (budget 2026) పై సీఎం చంద్రబాబు (chandrababu) స్పందించారు. రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు, దక్కిన వాటా, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై స్పందిస్తూ ఒక్క మాటలో ఇది ముందుచూపుతో కూడిన బడ్జెట్ అని తేల్చేశారు. కాబట్టి కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన అభినందనలు తెలిపారు.

కేంద్ర బడ్జెట్ భేష్ - చంద్రబాబు (chandrababu)

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింతగా దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహకరించేలా ఉందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విదానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించిందని, వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారిత సాధించేలా బడ్జెట్ ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఆర్ధిక మంత్రి బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రశంసించారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్స్ట్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్ కు వెళ్తుందన్నారు. రెన్యువబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ నేషన్ దిశగా బడ్జెట్ ఉందన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉందన్నారు.

Chandrababu Hails Union Budget 2026 as Forward Looking Commends PM Modi and FM Nirmala

హైస్పీడ్ రైల్ కారిడార్లు

హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హైస్పీడ్ కారిడార్లల్లో కవర్ అవుతాయన్నారు. బెంగుళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు, తదితర ప్రాంతాలు కవర్ అవుతాయని, ఈ మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయని వెల్లడించారు. హైదరాబాద్, అమరావతి, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు అన్ని అనుసంధానం అవుతాయన్నారు.

ఈ రంగాలకు మేలు

అలాగే డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్లో ఏపీ కూడా ఉందని, అత్యంత విలువైన భార ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించే అవకాశం ఉందన్నారు. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్ కు రూ.40 వేల కోట్లు పెట్టారని,టెక్స్ టైల్ సెక్టార్ కు కూడా ఊతమిచ్చారని, మన రాష్ట్రానికి ఈ అంశం చాలా ఉపకరిస్తుందని తెలిపారు. పర్యాటకానికి, హాస్పిటాలిటికి కూడా ప్రాధాన్యం ఇచ్చారని, మన రాష్ట్రంలో అరకులో టూరిజం పెరగడానికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. కొబ్బరి, జీడి, కోకో, చందనం లాంటి పంటలకు ఊతమిచ్చేలా చర్యలు ఉన్నాయన్నారు. డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు 2047 వరకూ పెట్టారని తెలిపారు. భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుందని, విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయని గుర్తుచేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయన్నారు. దీని వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. లాజిస్టిక్స్ రంగానికి ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. కేంద్ర బడ్జెట్టులో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+