Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: తిరుమలలో ఆ మాట తప్పా వేరే మాట వినిపించకూడదు, సీఎం

కలియుగ వైకుంఠ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు వెండి పళ్లెంలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

రాత్రి తిరుమలలో బస చేసిన సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్పా మరో మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండ పైన ప్రశాంతకి ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనా టీటీడీ అధికారులు రాజీ పడకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Chandrababu has issued orders not to make noise when VIPs arrive in Tirumala

తిరుమల కొండ పైన శ్రీవారి భక్తుల నిత్య అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు సూచించారు. అటవీ సంస్కరణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలని అటవీ ప్రాంతాన్ని 72 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అటవి శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదే సమయంలో తిరుమల కొండ పరిసర ప్రాంతాల్లో అటవీ సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి టీటీడీ అటవీ శాఖ అధికారుల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు టీటీడీ అధికారుల హడావిడి కనిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తిరుమల లడ్డుతో పాటు శ్రీవారి భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత ఎప్పుడూ కొనసాగించాలని, వీలైనంత నాణ్యత పెంచాలి తప్పా నాణ్యత తగ్గించాలని కలలో కూడా ఆలోచించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండపై ప్రతిరోజు 24 గంటలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చూడాలని, శ్రీవారి భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా ప్రవర్తించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.

Chandrababu has issued orders not to make noise when VIPs arrive in Tirumala

దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులను గౌరవించాలని, వారిపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండ పైన ఆర్భాటాలు అవసరం లేదని, అనవసరమైన ఖర్చులు చేయకూడదని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులకు సూచించారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి భక్తుడు నుండి అభిప్రాయాలు తెలుసుకునేలా పనిచేయాలని, భక్తుల సూచనలు సలహాలు ఆధారంగా వారికి సేవలు అందించడానికి టీటీడీ సిబ్బంది పనిచేయాలని, ఒక్క టీటీడీలోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో ఇది అనుసరించాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి ప్రసాదాలకు ఉపయోగించే పదార్థాల నాణ్యత తగ్గితే సహించేది లేదని, ఆహార పదార్థాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాటిని ప్రసాదాలు తయారు చెయ్యడానికి పంపించాలని, అన్న ప్రసాదాలను నాణ్యత ఇలాంటి పరిస్థితుల్లో తగ్గకూడదని, అలా జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Chandrababu has issued orders not to make noise when VIPs arrive in Tirumala

బయో డైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రతి దేవాలయంలో ప్రసాదాల నాణ్యత తగ్గకుండా చూసుకునే బాధ్యత మీపై ఉందని, సంబంధిత అధికారులకి మీరు ఆదేశాలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+