ఇన్ సైడర్ ట్రేడింగ్ లో బాబుదే పేటెంట్ .. రాజధాని అమరావతినే అని ముందే కలొచ్చిందా .. సాయిరెడ్డి ట్వీట్

ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి రాజధాని అమరావతి విషయంలో జరుగుతున్న రగడ నేపధ్యంలో మరోమారు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అమరావతిలో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు చేసింది వైసీపీ.అయితే జగన్ ప్రకటన తర్వాత వైసీపీ నేతలు వైజాగ్ లో భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసమే జగన్ ఈ ప్రకటన చేశారని రివర్స్ ఎటాక్ చేస్తుంది టీడీపీ . ఇక దీనిపై ట్విట్టర్ వేదికగా విజయ సాయి ట్వీట్ ల వర్షం కురిపించారు.

 తమ వాళ్లకు సమాచారం ఇచ్చి మరీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసేది చంద్రబాబే అన్న సాయి రెడ్డి

తమ వాళ్లకు సమాచారం ఇచ్చి మరీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసేది చంద్రబాబే అన్న సాయి రెడ్డి

రాష్ట్రానికి మూడు రాజధానులు అని సూచనాప్రాయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ తాపత్రయపడుతున్నారని, అందుకే ఇలా అలోచిన్చారని చెప్పారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకోవటం లేదని విమర్శించారు. అమరావతిలో రాజధాని, భోగాపురం ఎయిర్ పోర్టు ఇలా ఏది చేపట్టినా తన వాళ్లకు సమాచారం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగుకు పాల్పడ్డారని విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబుది పేటెంట్ అని విమర్శ

ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబుది పేటెంట్ అని విమర్శ

అక్రమాలకు పాల్పడటం , ఇన్ సైడర్ ట్రేడింగ్ చేయటం చంద్రబాబు పేటెంట్ అని విజయసాయి పేర్కొన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని రావడం ఇష్టం లేని దత్తపుత్రుడు, పచ్చపార్టీ నేతలు వైసీపీపై నిందలు వేస్తున్నారు అని ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిపి విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న వారంతా అమరావతిలో ఏం జరిగింది తెలుసుకోవాలన్నారు.

అమరావతి ప్రకటనకు ముందే బంధువులు , బినామీలు భూములు ఎలా కొన్నారో ? అని ప్రశ్న

అమరావతి ప్రకటనకు ముందే బంధువులు , బినామీలు భూములు ఎలా కొన్నారో ? అని ప్రశ్న

అమరావతిని అధికారికంగా ప్రకటించకముందే చంద్రబాబు నాయుడి బంధువులు, బినామీలు, పచ్చ మాఫియా వేల ఎకరాలు ఎలా కొన్నారో అర్థం చేసుకోవాలని విజయసాయి కోరారు. రాజధాని వస్తుందని అందరికీ ఒకే రోజు కల వచ్చిందా? ఏంటి అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన బల్ల గుడ్డి మరీ చెప్తున్నారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనేది జగన్ మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబువి అబద్దాలే అన్న వైసీపీ ఎంపీ

కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ బాబువి అబద్దాలే అన్న వైసీపీ ఎంపీ

ఇక కడప స్టీల్ ప్లాంటు విషయంలో చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరులా మిగిలారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.ఎన్నికల ముందు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే శంకుస్థాపన చేశారని, అక్కడ ఇనుప ఖనిజం సరఫరా హామీ లేదని ఆయన పేర్కొన్నారు . ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎన్ఎండీసీ తో ఏటా 50 లక్షల టన్నుల ఖనిజం సరఫరాకు ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పారు. జగన్ గారికి, మోసకారి బాబుకు తేడా ఇదే అంటూ ఆయన ట్వీట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+