బాబుకు మరో బాధ్యత: సీఎంల కమిటీకి కన్వీనర్, విపక్షాలకు షాకిస్తూ కమిటీలోకి నవీన్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ/న్యూఢిల్లీ: క్యాష్ లెస్ ప్రోత్సాహక కమిటీని కేంద్రం బుధవారం నాడు ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. తీవ్ర తర్జన భర్జన అనంతరం కమిటీని ఏర్పాటు చేశారు.

ఒక్క సలహా: నరేంద్ర మోడీని చంద్రబాబు చిక్కుల్లో పడేశారా?

కమిటీ సభ్యులుగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు ఉన్నారు.

 Chandrababu heading CMs panel, Naveen Patnaik joins sub committee

ముఖ్యమంత్రులతో పాటు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్ కాంత్‌, పవన్ కుమార్‌ చామ్లింగ్‌ తదితరులు కూడా సభ్యులుగా ఉన్నారు.

అవును, చంద్రబాబు నాయుడు కన్వీనర్ అయితే తప్పేంటి?: కేసీఆర్

దేశంలో క్యాష్ లెస్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇస్తుంది. డిజిట‌ల్ పేమెంట్స్‌లో భాగంగా కార్డుల వినియోగం, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ త‌దిత‌ర అంశాల‌పై ఈ క‌మిటీ సమగ్ర నివేదిక రూపొందిస్తుంది.

మోడీ-సబ్ కమిటీ: చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ప్రతిపక్షాలకు నవీన్ షాక్

తొలుత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌ను సబ్ కమిటీలోకి తీసుకుందామని కేంద్రం భావించింది. కానీ ఆయన నిరాకరించారు. దీంతో అసలు సబ్ కమిటీ ఏర్పాటవుతుందా లేదా అనేది కూడా ప్రశ్నగా మారినట్లు కనిపించింది. కానీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విపక్షాలకు షాకిచ్చారు. కేంద్రం ఆయనను సబ్ కమిటీలోకి తీసుకుంది. దానికి ఆయన కూడా అంగీకరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu heading CMs panel, Naveen Patnaik joins sub committee.
Please Wait while comments are loading...