అండగా ఉంటాం: మే డే వేడుకల్లో బాబు(పిక్చర్స్)

రాజమండ్రి: వివిధ రంగాల కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదవర్గాల్లో కార్మికులే ఎక్కువ ఉన్నారని, అలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మే డే వేడుకలను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు డ్రైవర్లకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించారు. తమ్మిశెట్టి ధనయ్య అనే ఆటో కార్మికునికి తొలి గుర్తింపు కార్డు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పథకంలో సభ్యునిగా ఉన్న డ్రైవరు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం లభిస్తుందన్నారు. 9నుంచి ఇంటర్, ఐటిఐ చదువుతున్న పిల్లలకు రూ.1200 ఉపకార వేతనం లభిస్తుందన్నారు.

సహజ మరణానికి రూ.30 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75 వేలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.37.5వేలు లభిస్తాయన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 4.5 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు, డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మంది మహిళా సభ్యులకు, గ్రామీణ విలేఖర్లకూ రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

డ్వాక్రా మహిళలకు మండలాల్లో ఒకటి, పట్టణాలు, నగరాల్లో 40నుండి 50 జనరిక్ మందుల దుకాణాలు కేటాయిస్తామని ప్రకటించారు. మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని ఇంతకుముందే ప్రకటించామని, వాటితోపాటు వారి వడ్డీని కూడా ప్రభుత్వమే భరించి, మాఫీ చేస్తుందన్నారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో శిక్షణనిప్పించి, భవిష్యత్తులో వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

మే డే వేడుకలు

మే డే వేడుకలు

వివిధ రంగాల కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

మే డే వేడుకలు

మే డే వేడుకలు

పేదవర్గాల్లో కార్మికులే ఎక్కువ ఉన్నారని, అలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మే డే వేడుకలను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.

మే డే వేడుకల్లో బాబు

మే డే వేడుకల్లో బాబు

ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు డ్రైవర్లకు రూ.5 లక్షల బీమా పథకాన్ని ప్రకటించారు. తమ్మిశెట్టి ధనయ్య అనే ఆటో కార్మికునికి తొలి గుర్తింపు కార్డు అందించారు.

మే డే వేడుకల్లో బాబు

మే డే వేడుకల్లో బాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పథకంలో సభ్యునిగా ఉన్న డ్రైవరు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం లభిస్తుందన్నారు.

మే డే వేడుకల్లో బాబు

మే డే వేడుకల్లో బాబు

9నుంచి ఇంటర్, ఐటిఐ చదువుతున్న పిల్లలకు రూ.1200 ఉపకార వేతనం లభిస్తుందన్నారు.

మే డే వేడుకల్లో బాబు

మే డే వేడుకల్లో బాబు

అసంఘటిత రంగ కార్మికులకు, డ్వాక్రా సంఘాల్లోని 90 లక్షల మంది మహిళా సభ్యులకు, గ్రామీణ విలేఖర్లకూ రూ.5 లక్షల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆ సామాజిక వర్గం అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చడంవల్ల ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తాను పడుతున్న కష్టానికి కార్మికులు కూడా సహకరించాలని చంద్రబాబు కోరారు. తాను రోజుకు ఐదు గంటలు కూడా నిద్రపోవడంలేదని, రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజల భవిష్యత్తు కోసం తాను కష్టపడుతున్నానన్నారు. ప్రతి కార్మికుడు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రికి ఎలా సహకరించాలని ఆలోచించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+